Thursday, May 9, 2024
- Advertisement -

బయటపడ్డ జేసీ భండారం… వైఎస్ కాళ్ళ దగ్గర ఊడిగం చేసిన వైనం ఏంటంటే?

- Advertisement -

వైఎస్ జగన్ గురించి చనువుగా జేసీ దగ్గర మాట్లాడేంత సన్నిహిత సంబంధాలు వైఎస్‌తో జేసీ దివాకరరెడ్డికి ఉన్నాయా? అసలు వైఎస్‌కి జేసీ సన్నిహితుడా? వైఎస్‌కి ఊడిగం చేస్తూ వైఎస్ కాళ్ళ దగ్గర బ్రతికిన బానిసనా? వైఎస్ హయాంలో వైఎస్‌తో జేసీకి ఎలాంటి సంబంధాలు ఉండేవి? ఇప్పుడైతే మాత్రం వైఎస్‌ సమకాలినుడిని నేను…. వైఎస్ ఇంట్లో సమస్యలను కూడా తనతో షేర్ చేసుకునేంత సన్నిహితత్వం మా మధ్య ఉంది అని చెప్పుకు తిరుగుతున్నాడు జేసీ. అయితే అసలు వాస్తవాలు మాత్రం వేరే ఉన్నాయి. చంద్రబాబుతో సహవాస దోషమో ఏమో కానీ వైఎస్‌ల గురించి ఇష్టారీతిన అబద్ధాలు చెప్పిన జేసీ తీరు గురించి…జేసీ నిజ స్వరూపం గురించిన నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి..

పైన ఫొటో చూశారు కదా. అదీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర జేసీ దివాకరరెడ్డి స్థాయి. వైఎస్ కాళ్ళ దగ్గర బ్రతికిన చరిత్ర జేసీది. 2009 ఎన్నికలు అయిపోయిన వెంటనే అనంతపురంలో సొంత పార్టీ నేతలనే ఓడించడానికి ప్లాన్స్ వేసిన జేసీని విమర్శలతో ఉతికి ఆరేశాడు వైఎస్. మంత్రి పదవికోసం అనంతపురంలో సొంత పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలను ఓడించడానికి ప్రయత్నం చేశాడు జేసీ. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ జేసీకి ఓ స్థాయిలో చీవాట్లు పెట్టాడు. మొత్తం వ్యవహారాన్ని సోనియాకు కూడా చెప్పి జేసీకి మంత్రి పదవి రాకుండా చేశాడు. వైఎస్ తర్వాత ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా జేసీకి మంత్రి పదవి అందుకే ఇవ్వలేదు. ఇక రాజకీయ కెరీర్ ప్రారంభం నుంచి కూడా వైఎస్ రాజారెడ్డి దగ్గర, వైఎస్ దగ్గర అణిగిమణిగి ఉన్న చరిత్ర జేసీది. ఇదే జేసీని పరిటాల వర్గం జనాలు చంపెయ్యాలని చూస్తే కాపాడింది కూడా వైఎస్సే అని అనంతపురం నాయకులు చెప్తూ ఉంటారు. అలాంటి జేసీ ఈ రోజు వైఎస్‌లపై అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే జేసీ సొంత నియోజకవర్గం ప్రజలే ఈసడించుకుంటున్నారు. అన్నింటికీ మించి వైఎస్‌కి ఊడిగం చేసి రాజకీయంగా నిలబడ్డ జేసీలు ఇప్పుడు కృతజ్ఙత లేకుండా చంద్రబాబు ప్రాపకం కోసం అదే వైఎస్‌లను విమర్శించడం జేసీలకు అసలు వ్యక్తిత్వమే లేదన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరడానికి ఇదే జేసీ చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఫ్యాక్షన్ ముద్రతో పాటు, అనంతపురంలో అరాచక రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జేసీలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ ఆసక్తి చూపించలేదు. అన్నింటికీ మించి సోంత పార్టీ నేతలను ఓడించడానికి కూడా వెనుకాడని వెన్నుపోటు రాజకీయాలు జేసీల సొంతం. అందుకే జగన్ నో చెప్పాడు. ఆ తర్వాతే ఎలా అయినా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు భారీగా డబ్బులిచ్చి సీట్లు కొనుక్కున్నారని అనంతపురంలో ఉన్న సీనియర్ టిడిపి నాయకులే చెప్తున్నారు. వైఎస్‌పై, జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడిన జేసీలు …….వైఎస్ కాళ్ళ దగ్గర ఊడిగం చేసిన వైనం గురించి అనంతపురంలో ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -