- Advertisement -

కేసుల మాఫీ కోసం రాజకీయాలా? రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టే కేసులా?

- Advertisement -

చేసేది గోరంత……చెప్పుకునేది కొండంత అన్న సూత్రం చంద్రబాబుకు బాగా వర్తిస్తుంది. నాలుగేళ్ళ నుంచీ ఆంధ్రప్రదేశ్‌కి మోడీ చిప్ప చూపిస్తూ ఉంటే……ఆ చిప్ప అద్భుతం…..మహాద్భుతం…..నేను చెప్తున్నా కదా……మీరూ నమ్మండి……అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మిస్తూ వచ్చాడు చంద్రబాబు. కాదు మహాప్రభో….అది ఎందుకూ పనికిరాని చిప్ప అని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తే…….‘చట్ అవతలికి పో…..అత్యంత అనుభవజ్ఙుడి ముందు పిల్ల రాజకీయాలు చేస్తావ్’ అని దబాయించాడు చంద్రబాబు. ఇప్పుడు పుణ్యకాలం మొత్తం అయిపోయాక…….2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబుకు అదే చిప్ప చూపించడానికి రెడీగా ఉన్నారు అని జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వేలు కూడా తేల్చేశాక, తన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అదే విషయం చెప్పాక ముంత్రుల ఉపసంహరణ అన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు. ఆ ఉపసంహరణ సందర్భంలో కూడా మోడీని ఆకాశానికేత్తేశారు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు. ఇక చంద్రబాబు కూడా ప్రజల్లో ఆవేశం, ఆగ్రహం ఉంది. తప్పక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్న తరహాలోనే మాట్లాడుతున్నాడు.

ఇంతోటిదానికి బాబు ఏదో చించేశాడు…….బాబు అద్భుతమైన హీరోయిజం చూడండహో అని బాబు చిడతల బ్యాచ్ మొత్తం రెడీ అయిపోయారు. ఇప్పటికీ చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. బిజెపి భాగస్వామ్య పార్టీగానే టిడిపి ఉంది. నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చిప్ప చూపిస్తున్నా బాబు సారథ్యంలోని టిడిపి ఆడుతున్న నాటకాలు ఇవి.

ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలవడానికి రెడీ అని జగన్ చెప్పాడు. ప్రత్యేక హోదా ఇస్తేనే కలుస్తాం అని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే సీన్‌ లేదు కాబట్టి కాంగ్రెస్‌కి మద్దతు అన్న ప్రశ్నేలేదని విజయసాయిరెడ్డి చెప్పాడు. ఏమీ ఇవ్వకపోయినప్పటికీ చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవచ్చు…..పొత్త కొనసాగించొచ్చు. కానీ ప్రత్యేక హోదా ఇస్తే మద్దతిస్తాం అని జగన్ అంటే మాత్రం మహా పాపం అయిపోతుంది. కేసుల మాఫీ కోసమే జగన్ రాజకీయాలు అని చెత్త రాజకీయాలు చేస్తారు. అసలు జగన్ కేసుల మాఫీ కోసం రాజకీయం చేస్తున్నాడా? లేక రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టే జగన్‌పై కేసులు ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియనివాళ్ళు ఎవరైనా ఉన్నారా? సోనియాను ఎదిరించబట్టే జగన్‌పై కేసులు అని స్వయంగా చంద్రబాబే చెప్పాడుగా?

బిజెపి చిప్ప చూపిస్తోంది మహా ప్రభో, హోదాకు జెకొట్టి ప్యాకేజీ నాటకాలు ఆడుతోంది అని సంవత్సరాలుగా నెత్తీ నోరు బాదుకుని మరీ ఎన్ని రకాలుగా పోరాటం చేయాలో అన్ని రకాలుగా పోరాటాలు చేసిన జగనేమో అతి పెద్ద విలన్ అట. పుణ్యకాలం మొత్తం తన అధికార స్వార్థం, వ్యక్తిగత స్వార్థం చూసుకున్న చంద్రబాబు ఎన్నికల ఏడాదిలో మోడీకి నొప్పి తగలకుండా ఆస్కార్ స్థాయి నాటకాలు ఆడుతుంటే……ఆ నాటకాన్ని అత్యద్భుత హీరోయిజంగా ప్రజలు చూడాలట. గోబెల్సా….గాడిద గుడ్డా…..అబద్ధాలను నమ్మించడంలో చంద్రబాబును మించినవాడు దేశ రాజకీయాల్లోనే లేడని బాబును దగ్గరగా చూసిన సీనియర్ జర్నలిస్టులు అందుకే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -