Monday, April 29, 2024
- Advertisement -

రైల్వేజోన్, పోలవరం, హోదా….. స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్‌ని బలిపెట్టిన బాబు… వాస్తవాలు ఇవిగో

- Advertisement -

తన ప్రయోజనాల కోసం, తన చుట్టూ ఉన్న వ్యాపారస్తుల, మీడియా అధినేతల ప్రయోజనాల కోసం ఏ స్థాయి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా రెడీ అవుతూ ఉంటాడు చంద్రబాబు. బాబు రాజకీయం మొత్తం కూడా బడా బడా ధనవంతుల ప్రాపకంతోనే సాగిందని సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. మురళీమోహన్, సుజనా చౌదరి, రామోజీరావు, రాధాకృష్ణల నుంచీ అంబానీలతో సహా ఆర్థికబలం, మీడియా బలం ఉన్నవాళ్ళతో బాబు సన్నిహిత సంబంధాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సినది ఏమీలేదు. మాదాపూర్‌ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో విస్తరించి ఉన్న బాబు సన్నిహితుల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్ఛర్యపోవాల్సిందే.

ఇక కేంద్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలను, సూచనలను కాదని విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ఎందుకు చేపట్టాడో…….అమరావతి చుట్టూ ఎంతమంది టిడిపి నాయకులు, నారాయణ లాంటి మంత్రల భూ వ్యవహారాలు ఉన్నాయో ఇప్పటికే చాలా సార్లు చర్చకు వచ్చాయి. అమరావతి చుట్టూ జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి, అవినీతి, అక్రమ వ్యవహారాల గురించి జాతీయ మీడియా ఓ స్థాయిలో విమర్శలు చేసింది.

ఇక పోలవరం నిర్మాణాన్ని కూడా కేంద్రం చేతుల్లో నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు చంద్రబాబు. పోలవరం నిర్మాణ వ్యవహారాలు, అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోవడాలు, కాంట్రాక్టులన్నీ కూడా తన సన్నిహితులకే ఇస్తూ ఉండడం లాంటివి అందరికీ తెలిసిన విషయాలే.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక షాకింగ్ విషయం తెలిసింది. హోదాతో అయితే తనకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అనుకున్నాడో లేక ప్యాకేజ్ నిధులు వేల కోట్లు వస్తే ఉపయోగం ఉంటుందనుకున్నాడో తెలియదు కానీ ప్రత్యేక హోదాను వద్దని చంద్రబాబే కేంద్రానికి నివేదించాడని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రజలను నేను ఒప్పిస్తాను. ప్రత్యేక హోదా అవసరం లేదు. ప్రత్యేక ప్యాకేజీ కింద భారీగా నిధులు ఇవ్వండి చాలు అని చంద్రబాబే కేంద్రప్రభుత్వానికి నివేదించాడని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం ఢిల్లీ స్థాయి జర్నలిస్టుల మధ్య చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు కూడా ఎన్నికల సంవత్సరం కాబట్టి బాబు హోదా పాట పాడుతున్నాడు కానీ 2019లో అధికారంలోకి వచ్చినా కూడా బాబు ప్రత్యేక ప్యాకేజీ నిధుల కోసమే పట్టుపడతాడని…..హోదాతో అధికారంలో ఉన్నవాళ్ళకు వ్యక్తిగతంగా పెద్దగా లాభం ఉండదని సీనియర్ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక రైల్వే జోన్ విషయంలో కూడా బాబు అండ్ కో రాజకీయం ఇలానే ఉందట. విశాఖపట్నంకు రైల్వే జోన్ రావడం టిడిపికి ఇష్టం లేదని చెప్తున్నారు. విజయవాడకు రైల్వేజోన్‌ని తెప్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని టిడిపి నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. విశాఖకు వస్తే ఒరిగేది ఏం ఉంటుందని….విజయవాడకు వస్తే అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందని సమర్థించుకుంటున్నారు.

ఏది ఏమైనా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు ముడిపడి ఉన్న విషయాలు అయిన రాజధాని నిర్మాణం, పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లాంటి విషయాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శరాఘాతమే అని ఢిల్లీలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -