Tuesday, May 21, 2024
- Advertisement -

అద్వానీకి అవమానం…… ఎన్టీఆర్ అవమానం కంటే ఘోరమా బాబూ?

- Advertisement -

తన రాజకీయ భవిష్యత్‌కి పూలబాట పరిచిన అద్వానీని నరేంద్రమోడీ అవమానించాడు. ముఖ్యమంత్రిగా తన ప్రభ వెలిగిపోవడానికి కారణమైన అద్వానీ ప్రధాని అభ్యర్థిగా తన పేరుకు అడ్డం పడాలని ప్రయత్నం చేసిన నాటి నుంచీ అద్వానీని అవమానిస్తూనే ఉన్నాడు మోడీ. మోడీ చేస్తోంది కచ్చితంగా తప్పే. కానీ 2014లో ఇదే మోడీని దేవుడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి……. నాలుగేళ్ళుగా నిండా ముంచుతున్నప్పటికీ …..మోడీ దేవుడే అని మాటలతో మభ్యపెడుతూ వచ్చి తీరా ఎన్నికల సంవత్సరంరాగానే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీతో పాటు బాబుకు కూడా 2014ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టించిన గతే పట్టించనున్నారని తెలిసేసరికి…. 2014ఎన్నికల్లో తనకు ఉపయోగపడిన మోడీ ఇమేజ్‌ని ఇప్పుడు పూర్తిగా హరించివేయడానికి రెడీ అయ్యాడు బాబు. ఒక్క మోడీ అనే కాదు …… వాడుకుని వదిలేయడానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు అని సీనియర్ రాజకీయవేత్తలు చెప్తూ ఉంటారు. ఆ విషయం తనకు కూడా తెలుసని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అద్వానీని మోడీ అవమానించాడని పచ్చ మీడియాతో పాటు బాబు అండ్ కో అందరూ రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు.

మరి ఎన్టీఆర్‌కి చంద్రబాబు చేసినది ఏంటి? మామపైనే పోటీ చేస్తా అని రెచ్చిపోయి మాట్లాడి……. కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన చంద్రబాబును…..పాపం పోనీలే అని పార్టీలో చేర్చుకున్నాడు ఎన్టీఆర్. మంత్రి పదవులు ఇచ్చాడు. కానీ చంద్రబాబు ఏం చేశాడు? నమ్మంచి మోసం చేశాడు. అధికార స్వార్థంతో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్‌పై చెప్పులేయించాడు. ‘ఎన్టీఆర్‌కి విలువలు లేవు’ అని జాతీయ స్థాయి మీడియా సంస్థతో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని హరిస్తూ చాలా అమానవీయంగా మాట్లాడేశాడు. అలాంటి చంద్రబాబు అండ్ కోకు అద్వానీని మోడీ అవమానించాడు అని మోడీని విమర్శించే అర్హత ఉందా? ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన పాపంతో పోల్చితే అద్వానీ విషయంలో మోడీ చేసిన పాపం ఎంత? అదేంటో మరి బాబు అండ్ కో అందరికీ కూడా బాబు చేస్తే ఏదైనా అతి పవిత్రమైన సంసారంలా కనిపిస్తుంది. అవినీతి, అక్రమ వ్యవహారాల్లో ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయినా కూడా విశ్వప్రజా ప్రయోజనాల కోసం బాబు అహర్నిశలూ కష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే ఇతరుల విషయంలో మాత్రం పూర్తి రివర్స్. రాష్ట్ర విభజన పాపంలో ప్రధాన భాగం పంచుకుని బిజెపి పాపాన్ని దాచిపెట్టి 2014ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత మోడీకి ఓట్లేయించి…….. నాలుగేళ్ళుగా చిప్ప చూపిస్తున్నా అధికార స్వార్థంతో మోడీకి జైకొట్టి……. ఎన్నికల సంవత్సరంలో ఓట్ల కోసం, అధికార స్వార్థంతో బాబు నడిపిస్తున్న డ్రామాలన్నీ ప్రజా సంక్షేమం కోసమే అని చెప్తారు. ‘ప్రత్యేక హోదా ఇస్తేనే……… హోదా ఇస్తే ఏ పార్టీతో అయినా కలుస్తాం……. మోడీకి అయినా మద్దతిస్తాం’ అని వైఎస్ జగన్ అంటే మాత్రం స్వార్థంతో మోడీకి మద్దతిస్తున్న జగన్ అని రంకెలేస్తారు. ఒక్కసారి పచ్చ బ్యాచ్ నాటకాలు అన్నీ ప్రజలకు అర్థమయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయే స్థాయి పాఠం బాబుకు నేర్పిస్తారనడంలో సందేహమే లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -