- Advertisement -

పచ్చ అంతరంగం……. బాబు గెలవకపోతే ఎపి సర్వనాశనం అవ్వాలని కోరుకుంటున్నారా?

- Advertisement -

వైఎస్ జగన్ గెలుపు గురించి……..చంద్రబాబు ఓటమి గురించి చంద్రబాబుతో సహా టిడిపి నేతలకు, పచ్చ మీడియాకు ఒక స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. ఐదేళ్ళు అద్భుతంగా చేశాం అని డబ్బా కొట్టుకున్న పచ్చ పార్టీ జనాలందరూ కూడా ఇప్పుడు ఓటమి భయంతో గజగజా వణుకుతున్నారు. అంటే ఐదేళ్ళుగా చేసింది ఏమీ లేదు……అన్నీ డ్రామాలే అన్న ప్రతిపక్షం మాటలు నిజమని వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నట్టా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఏం పని అడుగుతున్న అదే నోటితో దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాశ్మీర్‌ని పాకిస్తాన్‌లో కలిపెయ్యాలి అని వాక్రుచ్చిన నేతలకు కూడా ప్యాకేజీలు ఇచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి జగన్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తోంది పచ్చ పార్టీ. ఐదేళ్ళలో దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబునాయుడు ఇప్పుడు పేద అరుపులు, సానుభూతి మాటలు చెప్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ వారి కార్ డిక్కీలో విశ్రాంతి, మట్టికుండలో భోజనం లాంటి డ్రామాల గురించి చెప్పనవసరం లేదు.

అయితే ఇలాంటి డ్రామాలన్నింటినీ ప్రజలు ఛీ కొడుతున్నారు అని వెంటనే రియలైజ్ అయిన ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు మరో రకంగా ప్రచారం మొదలెట్టారు. బాబు ఓడిపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అని గావుకేకలు పెడుతున్నారు. జగన్ గెలిస్తే అంతా నాశనమే అని పవన్ కళ్యాణ్ కూడా గొంతు చించుకుంటున్నారు. ఈ రోజు పచ్చ మీడియాలో వచ్చిన వార్తల్లో అన్ని వార్తల సారాంశం ఒక్కటే చంద్రబాబు ఓడిపోతే రాష్ట్రం సర్వనాశనం అని జనాలను భయపెట్టడమే. అదండీ వీళ్ళకు రాష్ట్రంపైన ఉన్న ప్రేమ. చంద్రబాబు గెలిస్తే ఒకే. ఒక వేళ ఓడిపోతే మాత్రం రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబే దిక్కు…..మేమే దిక్కు అని చెప్పి జనాలను మాయ చేయడానికి, భయపెట్టడానికి, బానిసలను చేసుకోవడానికి కూడా తెగిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు అని ఏ స్థాయిలో ఈ పచ్చ బ్యాచ్ అంతా నమ్ముతున్నారో చెప్పనవసరం లేదు.

తెలంగాణా నుంచీ లక్ష కోట్లు రావాలంటున్న చంద్రబాబు ఈ ఐదేళ్ళలో కేసీఆర్‌ని ఎందుకు అడగలేదు? ఎందుకు ఫెయిలయ్యాడు? పైపెచ్చు పరిటాల రవి ఇంట్లో కేసీఆర్‌కి విందులు, వెలమ-కమ్మ జోడీ వెల్కం గ్రూప్ అనీ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ చిందులులాంటివి ఎందుకు వేసినట్టు? ఇక పవన్ కళ్యాణ్ కూడా తక్కువేం తినలేదు. కేసీఆర్‌ని ఓ రేంజ్‌లో పొడిగేసి అజ్ఙాతవాసికి డబ్బులు చేసుకున్నారు. కేసీఆర్‌ని కానీ మోడీని కానీ ఎప్పుడూ పొగడని నాయకుడు జగన్ ఒక్కడే. ఇక ఇప్పుడు ఓటమి భయంతో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టడం, పక్క రాష్ట్రంతో ఎపికి గొడవలు పెట్టడం, మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం పూర్తిగా ఉన్న మోడీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా కోపం వచ్చేలా చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఎపికి తీరని నష్టం చేస్తున్నారు. ఐదేళ్ళలో హోదాతో సహా ఏ ఒక్క ప్రయోజనాన్ని తీసుకురాలేకపోయిన చంద్రబాబు, టిడిపి జనాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావి ముసుగేసుకున్నవాళ్ళు, మీడియా రాజగురువులందరూ కూడా ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తూ బాబు గెలవకపోతే రాష్ట్రం సర్వనాశనమే అని ప్రతి ఎన్నికలప్పుడూ పాడే పాటే పాడుతున్నారు. అధికారం కోసం కాదు………..ప్రజాసేవ అంటే కసి, ఎపి అంటే ప్రేమ అని చెప్పుకునేవీళ్ళందరూ కూడా ఇప్పుడు బాబు ఓడిపోతే రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -