Friday, May 3, 2024
- Advertisement -

జగన్ లండన్‌ టూర్ రద్దు……….. అసలు కారణం ఏంటంటే?

- Advertisement -

సంవత్సరం పైగా ప్రజాసంకల్పయాత్రలో ప్రజలతో కలిసి ఉన్న వైఎస్ జగన్ కుటుంబానికి మాత్రం టైం కేటాయించలేకపోయాడు. అయితే పాదయాత్ర అయిన వెంటనే లండన్‌లో చదువుకుంటున్న తన కూతురి దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ ప్రోగ్రాం ఆగిపోయింది. లండన్‌ టూర్‌ని రద్దు చేసుకున్నాడు జగన్. అయితే దీని వెనకాల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితేనేం వైఎస్ జగన్ తన చెల్లితో ఎలా మాట్లాడతాడు? తల్లితో ఏం మాట్లాడతాడు? వైఎస్ రాజశేఖరరెడ్డితో వైఎస్ జగన్ ఏం మాట్లాడేవాడు లాంటి విషయాలన్నీ జగన్ ఇంట్లోనే ఉండి చూసినంత గొప్పగా వార్తా కథలు రాసే పచ్చ మీడియా ఈ సారి కూడా జగన్ వ్యక్తిగత జీవితంపై రకరకాల కామెంట్స్ చేసింది. రాజకీయ కారణాలుగా తేల్చిపారేసింది.

అయితే తాజాగా లండన్ టూర్ రద్దు వెనకాల ఉన్న అసలు కారణాన్ని స్వయంగా వైఎస్ జగన్ సన్నిహితులే చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తన కూతురు దగ్గరకు వెళ్ళి నాలుగైదు రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఆలోచించిన మాట నిజం. అయితే ఆ తర్వాత తన కూతురితో మాట్లాడినప్పుడు తనకు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని, ఇప్పుడు వస్తే స్టడీస్‌కి ఇబ్బందని, ఎక్కువ టైం స్పెండ్ చేయలేనని వైఎస్ జగన్ కూతురు చెప్పిందట. కూతురు వెర్షన్ విన్న జగన్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. పరీక్షలు అయ్యాక ఆ అమ్మాయే వస్తానని చెప్పడంతో కుటుంబం మొత్తం కూడా సమ్మతి తెలిపారు. లండన్ టూర్ రద్దు వెనకాల అసలు కారణం ఇది.

అయితే కేసీఆర్‌తో చర్చల కోసమో, టికెట్ కేటాయింపులు చెయ్యడం కోసమో లండన్ టూర్ రద్దు చేసుకున్నట్టుగా పచ్చ బ్యాచ్ మొత్తం ప్రచారం చేయడం పట్ల విశ్లేషకులు కూడా ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి జగన్‌కి మధ్య సంబంధాలు, వైఎస్ విజయమ్మ, షర్మిళ……ఇంకా జగన్ సొంత ఇంటి మనుషుల అందరి వ్యక్తిగత జీవితాల గురించి విషం చిమ్మిన పచ్చ బ్యాచ్ ఇప్పుడు జగన్ కూతురి విషయంలో కూడా వ్యాఖ్యానాలు చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత ఇంటి మనుషులకే వెన్నుపోటు పొడవడం, సొంత బంధువులను కూడా పదవుల కోసం వాడుకుని వదిలేసే నైజం ఉన్నవాళ్ళకు అందరూ వాళ్ళలాగే ఉన్నారన్న పచ్చ కళ్ళ సిద్ధాంతంతో ఆలోచిస్తున్నారని, వైఎస్‌లకు అలాంటి నీచ రాజకీయ చరిత్రలేదని సోషల్ మీడియాలో పచ్చ బ్యాచ్ అందరిపై కామెంట్స్ చేస్తూ ఉండడంతో పచ్చ బ్యాచ్ ప్రచారం సెల్ఫ్ గోల్ అయ్యినట్టుందన్న అబిప్రాయం కలుగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -