జియో ప్రతి పండగకు ఏదో ఒక ఆఫర్ ఇస్తునే ఉంది. తన ఆఫర్స్ తో యూజర్స్ ను ఇంకా పెంచుకుంటుంది. అంతేకాకుండా ఇతర టెలికం కంపెనీలు ఇవ్వలేని ఆఫర్స్ ఇస్తూ.. వాటికి గట్టి షాక్ ఇస్తోంది. ఇప్పుడు జియో సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటించింది.
రూ.399 జియో ధన్ ధనా ధన్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. అంతే మొత్తాన్ని అంటే 399 రూపాయలను క్యాష్ బ్యాక్ గా ఇస్తోంది. అక్టోబర్ 12 నుంచి 18 తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఈ ఏడు రోజుల్లో రూ.400 విలువ గల 8 వోచర్లను అందిస్తున్నది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. ఈ వోచర్లను నవంబర్ 15వ తేదీ తరువాతే వినియోగించుకోవాలి. జియో అందిస్తున్న రూ.50 వోచర్లలో ఒక వోచర్‌ను ఒకసారి మాత్రమే వాడుకోవచ్చు. గరిష్టంగా ఒక రీచార్జ్ కి ఒక వోచర్‌ను మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు.
రూ.309.. ఆపైన విలువ గల ప్లాన్లు లేదా రూ.91 ఆపైన విలువ గల డేటా యాడాన్ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 19వ తేదీన దీపావళి సందర్భంగా పలు కొత్త ప్లాన్లను ప్రకటిస్తామని జియో తెలిపింది. జియో యాప్, జియో వెబ్‌సైట్, జియో స్టోర్స్‌లలో దేని ద్వారా రీచార్జి చేయించుకున్నా 8 వోచర్లు యూజర్లకు లభిస్తాయి.
