Friday, May 3, 2024
- Advertisement -

నంది గోల‌లో క‌ల‌సిపోయిన మాన‌వ‌త్వం….

- Advertisement -

ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌పుడు ప్ర‌భుత్వానికి మైలేజ్ వ‌స్తె దాన్ని హైలెట్ చేయ‌డం…..చెడ్డ‌పేరు వ‌స్తె దాన్ని క‌ప్పెట్ట‌డం సాధార‌నంగా జ‌రుగుతుంటాయి. కాని దానింక‌టు కొంత ప‌రిధి ఉంటుంది. కాని స‌రిగ్గా ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర జరిగిన ఫెర్రీ బోటు ప్రమాదం లో 23 మంది మరణించారు. మ‌రి కొంత మంది గాయాల‌పాల‌య్యారు. దీనికి ముమ్మాటికి ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌నె విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

త‌మ ప్ర‌భుత్వానికి ఎక్క‌డ చెడ్డ పేరు వ‌స్తుందో న‌ని హ‌టాత్తుగా నందుల‌గోల తెర‌మీద‌కు తెచ్చారు. దీనికి కార‌ణం అంత‌ర్జాతీయ స్థాయిలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మానం జ‌రుగుతున్న ప్రాంతం కావ‌డంతో మీడియా కూడా ఘాటుగానె స్పందించింది. బోటు ఘ‌ట‌న ఎక్క‌డ ప్ర‌భుత్వానికి చుట్టుకుంటుందోన‌ని నంది అవార్డుల‌ను పైకి తెచ్చారు. దాన్ని క‌ప్పిపుచ్చ‌డంలో బాబు ప‌చ్చ‌మీడియా స‌క్సెస్ అయింది.

బోటు ఘ‌ట‌న వెనుక అధికార పార్టీ మంత్రుల అనుచ‌రులు ఉన్నార‌నె వార్త‌లు బ‌లంగా వ‌నిపించాయి. వారితోపాటు టూరిజం అధికారుల పాత్ర‌కూడా ఉంద‌నె వార్త‌లు వ‌చ్చాయి. అధికారుల అండ‌దండ‌ల‌తోనె అనుమ‌తి లేని బోట్లు తిరుగుతున్నాయి. దాదాపు 60 బోట్లు అన‌ఫిసియ‌ల్‌గా కృష్ణ‌న‌దిలో తిరుగుతున్నాయంటె దీని వెనుక ఎంత అవినీతి ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

త‌మ అవినీతిని క‌ప్పిపుచ్చుకొనేందుకు నందుల చాటున మాన‌వ‌త్వాన్ని అదే న‌దిలో ముంచేశారు. అవినీతిలో మునిగి 22 ప్రాణాలను నదిలో క‌ల‌సిపోయాయి. వాల్ల‌కు అండ‌గా ఉండాల్సిన ప్ర‌భుత్వం తూతూ మంత్రంగా ఎక్స్ గ్రేసియా ప్ర‌క‌టించి చేతులు దులుపుకుంది. బోటు ఘ‌ట‌న ఇంకా పెద్ద‌ది కాక‌ముందె దాన్ని నందుల చాటున భూస్తాపితం చేయ‌డంలో ప్ర‌భుత్వం విజ‌యం సాధించింద‌నుకోవాలి.

పడవ ప్రమాదం పక్కదారి పట్టించేందుఉ నంది గోలను ముందుకు తీసుకొచ్చింది ప్ర‌భుత్వం. అనుకోకుండా నందుల ప్ర‌క‌ట‌న చేసింది. దీనిపై ఎంత‌టి దుమారం రేగిందో అంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టికీ ఇదే చ‌ర్చ కొన‌సాగుతోంది. స‌ద్దుమ‌నిగిన సంఘ‌ట‌న‌ను మంత్రి లోకోష్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ఆజ్యం పోశాయి.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేశాక, అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన సంఘటన ఇది.. ఇటువంటి సమయంలో సరిగ్గా…… నంది అవార్డుల ప్రధానోత్సవం మొదలైంది…. పడవ ఘటన నంది రగిల్చిన మంటల్లో కొట్టుకుపోయింది. సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ నంది గొలే. విచిత్రంగా ఎన్నడూ లేని విధంగా జ్యూరీ సభ్యులు సైతం ప్రత్యక్ష చర్చల్లోకి దిగిపోయి, ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నారు.

నిజానికి ప్రభుత్వం తల్చుకుంటే ఈ నంది ర‌చ్చ‌ను ఆపవచ్చు. అలా చేయక పోగా కనీసం తాను నియమించిన జ్యూరీ సభ్యులను కూడా నియత్రించలేదు.దీని బట్టి చూస్తే పడవ ప్రమాదాన్ని ప్రక్కకు పెట్టడంతోపాటు అటు ప్రతిపక్ష నేత చేస్తున్న పాదయాత్రకు కూడా ప్రాణ ప్రాధాన్యత తగ్గించడమే ఈ నంది మంటలు వెనుక దాగి ఉన్న నిర్ణయం అని కొందరు ఆరోపిస్తున్నారు. దీన్ని విజ‌యవంతం చేయ‌డంలో ఎల్లోమీడియా పూర్తి స‌క్సెస్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -