ఛీ……ఛీ………….నాయకులా వీళ్ళు………తెలుగువారిపైన ప్రేమ ఉందా?

- Advertisement -

‘తెలంగాణాలో ఆంధ్రావాళ్ళను కొడుతున్నారు…..’………వినడానికే అసహ్యంగా ఉన్న ఈ వ్యాఖ్య చేసింది నిస్వార్థరాజకీయాల కోసం వచ్చా అని చెప్పుకునే పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి గుంపగుత్తగా సోనియాకు పార్టీని అమ్ముకుని తెలంగాణా విభజనకు జై కొట్టిన చిరంజీవిగారి తమ్ముళుంగారు ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం, తనకు ప్యాకేజ్ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం చేసిన వ్యాఖ్య అది. ఆ మధ్య వెలమ-కమ్మలు భలే కలిసిపోతున్నారు. వెల్కం గ్రూప్ అని అందరూ హ్యాపీగా ఉన్నారు. సీమాంధ్రలో కూడా కేసీఆర్‌కి జై కొడుతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్‌లో మహదానందంగా పొంగిపోతూ రాసినప్పుడు……..కేసీఆర్‌ని ఎపి మంత్రులు, చంద్రబాబు ఘనంగా ఎపికి ఆహ్వానించినప్పుడు, కేేసీఆర్‌కి పరిటాల రవి ఇంట్లో ఘనంగా విందు ఇచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ…..ఏ వైభోగాల్లో దాగున్నాడో…లేక ఏ కలుగులో దాక్కుని ఉన్నాడో తెలియదు. ఆ తర్వాత ఈయనగారు కేసీఆర్ పాలన అద్భుతం అంటూ భజన కీర్తనలు ఓ స్థాయిలో ఆలపించాడు. అప్పుడంతా చంద్రబాబుకు కానీ ఆయన జేబులో బొమ్మ అయిన పవన్‌కి కానీ సీమాంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్లు, తెలంగాణాలో సీమాంధ్రులు పడుతున్న ఇబ్బందులు గుర్తుకురావు.

కేసీఆర్ గవర్నమెంట్‌ని పడగొట్టాలని చూడడం, తగుదునమ్మా అంటూ కాంగ్రెస్‌కి డబ్బులు స్పాన్సర్ చేసి తెలంగాణాలో కేసీఆర్‌ని ఓడించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలతో తిక్కరేగిన కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబును ఓడిస్తాను అని బాబుని విమర్శించేసరికి చంద్రబాబు చెంచాగిరి చేసేవాళ్ళు అనాలో……భజన బ్యాచ్ అనాలో తెలియదు కానీ రామోజీరావు, రాధాకృష్ణల నుంచీ పవన్ కళ్యాణ్, శివాజీ…ఇంకా బాబు ఇచ్చే ప్రయోజనాలకు అలవాటు పడ్డ జనాలందరికీ ఆంధ్రుల ఆత్మగౌరవం గుర్తొస్తోంది. హరికృష్ణ శవం దగ్గర కేసీఆర్‌తో పొత్తు రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే కేసీఆర్, కేటీఆర్‌లను ఓ స్థాయిలో తిడుతున్నాడు. వీళ్ళంతా కలిసి కేవలం ఎన్నికల్లో కొన్ని ఓట్ల కోసం సీమాంధ్ర-తెలంగాణా ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. రెచ్చగొడుతున్నారు. తెలుగు ప్రజలు కొట్టుకుచచ్చే పరిస్థితి వస్తేనేమి……….మాకు మాత్రం ఓట్లు, పదవులు కావాలి అన్న తరహాలో రాజకీయాలు చేస్తున్నారు.

ఇలాంటి నాయకులందరూ కూడా మళ్ళీ జగన్‌వి రాక్షస రాజకీయాలు అని అంటారు. విభజన రాజకీయాలు చేస్తున్నాడు, కుట్రలు పన్నుతున్నాడు…..జగన్‌కి పదవీ స్వార్థం అని విమర్శిస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం పది కోట్ల మంది తెలుగు ప్రజలు కొట్టుకుచచ్చినా పర్లేదు………మాకు రాజకీయ స్వార్థం, పదవులే కావాలి అని నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్న ఈ పచ్చ బ్యాచ్ జనాలు, పవన్ కళ్యాణ్ కంటే రాక్షస రాజకీయం వేరే ఉంటుందా అని సోషల్ మీడియాలో నిగ్గదీసి అడుగుతున్నారు నెటిజనులు. ఈ సిగ్గులేని రాజకీయాన్ని చూసి సీమాంధ్రులందరూ ఛీ ఛీ అనే పరిస్థితులు త్వరలోనే వస్తాయని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -