Sunday, May 12, 2024
- Advertisement -

డేటానే ఆయుధంగా మ‌లుచుకున్న ఆ డేవిల్ ఎవ‌రు?

- Advertisement -

అభిమ‌న్యుడు మూవీ చూశారా? ప్ర‌జ‌లకు సంబంధించిన డేటా మొత్తం ఓ క్రిమిన‌ల్ చేతిలో ప‌డితే వ‌చ్చే న‌ష్టాలేంటో.. స్మార్ట్‌ఫోన్ టెక్నాల‌జీని త‌మ స్వార్థానికి ఎలా వాడుకుంటారో క‌ళ్ల‌కు కట్టిన‌ట్టు చూపించారు. గిఫ్ట్ ప్రైజ్‌లు, కూప‌న్‌లు అంటూ ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి వివ‌రాలు సేక‌రించి వాటితో ఎలా వ్యాపారం చేస్తారో.. వాటిని త‌మ స్వార్థానికి ఎలా వాడుకుంటారో.. మ‌న‌కు ఏ మాత్రం అనుమానం రాకుండా మ‌న అకౌంట్‌ల‌ను ఎలా గుళ్ల చేస్తారో చూపిస్తారు ఆ మూవీలో.

ఇప్పుడిదంతా ఎందుకంటే ప్ర‌స్తుతం ఏపీలో కూడా ఈ డేటాను త‌మ ఆయుధంగా మ‌లుచుకోని త‌మ ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకున్నారు. ఈ మూవీలో ఉన్న‌ట్లు డేవిల్ లాంటి క్యారెక్ట‌ర్‌లు క‌నిపిస్తున్నాయి కాబ‌ట్టి. ఎలా సేక‌రించారో? ఎప్పుడో సేక‌రించారు? తేలీదు కానీ.. ఏపీలో వార్డుల వారీగా వ్య‌క్తిగ‌త వివ‌రాలు అంటే కులం, మ‌తం, ఏ బ్యాంక్‌లో అకౌంట్‌లు ఉన్నాయి అన్న వివ‌రాల‌తో స‌హా ఐటీ గ్రిడ్ అనే సంస్థ వ‌ద్ద వివ‌రాలు ఉండ‌టం ఇప్పుడు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ సంస్థ టీడీపీ అధినేత చంద్ర‌బాబు జేబు సంస్థ కావ‌డం మ‌రింత విస్మ‌యానికి గురి చేస్తోంది.

ఏపీలో ల‌క్ష‌ల్లో ఓట్ల‌ తొల‌గింపుకు.. ఈ డేటా వ్య‌వ‌హ‌రానికి ఏదో లింక్ ఉంద‌న్న అనుమానంతో కొంద‌రు హైద‌రాబాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. హైద‌రాబాద్ పోలీసుల‌నే ఆశ్ర‌యించడానికి కార‌ణం ఈ సంస్థ హెడ్ క్వార్ట‌ర్స్‌తో స‌హా అన్ని కార్య‌క‌లాపాల‌ను చ‌క్క‌బెట్టేది హైద‌రాబాద్ నుంచే కాబ‌ట్టి.

ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంస్థ సీఈఓ అశోక్ కోసం గాలింపులు జ‌రుపుతున్నారు. సద‌రు సంస్థ సీఈఓ ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసుకు సంబంధించి ఒక్క మాట మాట్లాడ‌లేదు కానీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ మాత్రం గొంతు చించుకుంటున్నారు. ఇది ఏపీ ప్ర‌జ‌ల‌పై దాడి అంటూ అభిర్ణిస్తున్నారు. ఏ ర‌కంగా ఇది దాడి అంటున్నారో మాత్రం చెప్ప‌రు. త‌మ్ముళ్లు మ‌న డేటాను దొంగిలిస్తున్నారు అంటున్నారు కానీ.. మ‌రి ఇంత డేటా ఆ కంపెనీ వ‌ద్ద ఎందుకు ఉంది? అని మాత్రం ప్ర‌శ్నించ‌డం లేదు.

ఇక ఈ ఇష్యూను డైవ‌ర్ట్ చేయ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు జ‌ర‌గుతున్నాయి. ఇది వైఎస్ఆర్‌సీపీ-టీఆర్ ఎస్ కుట్ర అని చంద్ర‌బాబు ప్ర‌సంగాలు అనుకూల మీడియాలో హోరెత్తుతుంటే.. దర్యాప్తు అన్యాయ‌మంటూ కోర్టు కెక్కారు. త‌మ సంస్థ ఉద్యోగులు క‌న్పించ‌డం లేద‌ని ఐటీగ్రిడ్ సంస్థ‌ హ‌డావుడిగా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం.. పోలీసులు వారిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌డం.. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగించాల‌ని కోర్టు తెల్చిచెప్ప‌డంతో టీడీపీ నేత‌ల‌కు ఏం చేయాలో పాలుపొని ప‌రిస్థితి.

ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి సేక‌రించిన త‌మ కార్య‌క‌ర్త‌ల డేటాను దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చంద్ర‌బాబు అంటున్నారు. అందులో కేవ‌లం కార్య‌క‌ర్త‌ల డేటా మాత్ర‌మే కాదు.. మొత్తం ఏపీ ప్ర‌జ‌ల డేటా ఉంద‌ని విప‌క్ష నేత‌ల మాట‌. ఇలాంటి సంద‌ర్భంలో ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న హైద‌రాబాద్ పోలీసులు మీడియా స‌మావేశంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత సునిశిత సమాచారాన్ని భద్రపరిచినట్లు గుర్తించాం. దీనికి సంబంధించి సంస్థ ఉద్యోగులు నలుగురిని రెండ్రోజుల పాటు విచారించాం. ఐటీగ్రిడ్ కార్యాలయంలో ల్యాప్ టాప్ హార్డ్ డిస్క్ లు పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. ఐటీ గ్రిడ్ సంస్థ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు ఇచ్చాం. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ…. ఈసీకి లేఖ రాశామ‌న్నారు తెలింగాణ పోలీసులు.

అక్క‌డితో ఆగ‌లేదు టీడీపీ అధికారిక యాప్ అయిన ‘సేవా మిత్రస‌తో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తేలిందంటున్నారు పోలీసులు. నియోజకవర్గాల వారీగా ఓటర్ ఐడీ ఆధార్ కార్డుల సమాచారాన్ని కూడా సేకరించారన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్ ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వారి కులాల వివరాలు ఉన్నాయన్నారు.

మ‌రి చంద్ర‌బాబు చెపుతున్న మాట‌లు ఉట్టి అబ‌ద్ధాలే అన్న విష‌యం దీంతో అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ డేటాను ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారు? అన్న‌ దానిపైనే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు పోలీసులు. ఈ డేటాను ఉప‌యోగించే ఓట్ల‌ను తొల‌గిస్తున్నారా? యూఐడీఏ నుంచి ఈ డేటాను చోరి చేశారా? ఈ దురాగ‌తం వెనుక ఉన్న డేవిల్ చంద్ర‌బాబేనా? చూడాలి తెలంగాణ పోలీసులు ఏం చేస్తారో? ఏం తెలుస్తారో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -