Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్ త‌ప్పుచేస్తె 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ల‌జే తీర్పు ఇస్తారు.. ప‌చ్చ‌నాయ‌కుల‌కు నోటీదూల ఎందుకో..

- Advertisement -

ఏపీలో ప్ర‌జా స్వామ్యం ఎప్పుడో మంట‌గ‌ల‌సి పోయింది. ఇప్పుడు నిప్పు నిప్పు అని చెప్పుకుంటుంటె ప్ర‌జ‌లు న‌వ్విపోదురు గాక అన్న చందంగా త‌యార‌య్యింది. అసెంబ్లీ స‌మావేశాల‌ను వైసీపీ బ‌హిస్క‌రిస్తె … దానిమీద ప‌చ్చ‌పార్టీ నాయ‌కులు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా అంటూ నోటి దూల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అస‌లు ప్ర‌జాస్వామ్యం అంటె ఏంటో తెలుగు దేశం పార్టీలో మ‌ర్చిపోయి చాలా కాలం అయ్యింది. ప్ర‌జాస్వామ్యం అంటె స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎవ‌రైనా రావాలంటె అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామ చేసి పార్టీలోకి రావాలి అది ప్ర‌జా స్వామ్యం. కాని ఇప్పుడు ప‌రిస్థితి వేరు. సంత‌ల్లో ప‌శువుల్లాగా పార్టీ అధినేత‌,సీఎం చంద్ర‌బాబునాయుడు రండీ బాబు రండి పార్ట‌లో చేరండి…మీకు కావాల్సిన ప్యాకేజీలు సిద్ధంగా ఉండాయంటు నాయ‌కుల‌ను కొంటున్నారు.

తెలంగాణాలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లు వెల్తుంటె గొంతు చించుకొని రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తున్నారంటూ చంద్ర‌బాబు విమ‌ర్శించారు. అదే చంద్ర‌బాబు ఏపీలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించి రాజకీయ వ్యభిచారంలో తమ పార్టీ తక్కువేమీ తిన్లేదని నిరూపించేశారు.

పార్టీ ఫిరాయించిన వారంతా అసెంబ్లీలో పచ్చ కండువాలు కప్పుకుని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కన్పిస్తోంటే.. వారిని చూడ్డానికి అసెంబ్లీకి ప్రతిపక్షం వెళ్ళాలంట ఇది అధికార ప‌ర్టీ వాద‌న‌. య‌నుమ‌ల రామ‌కృష్ణుడు, అశోక్‌గ‌జ‌ప‌తి రాజు,ఇత‌ర నేత‌లు వైసీపీపై గుస్సా అవుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానె ఉంది. మ‌రి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్స‌హిస్తున్న బాబుని ప్రజాస్వామ్యం గురించీ, నైతిక విలువల గురించీ క్లాసులు పీకే ధైర్యముందా ఈ నాయ‌కుల‌కు. అంత ధైర్యం ఉందా లేదు అందుకె జ‌గ‌న్‌మీద ఒంటికాలిపై లేస్తున్నారు.

జ‌గ‌న్ త‌ప్పు చేస్తున్నార‌ని నాయ‌కులంతా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిజంగా జ‌గ‌న్ త‌ప్పుచేస్తె వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే తీర్పు నిస్తారు. మ‌రి ప‌చ్చ నాయ‌కుల‌కు అంత‌నోటి దూల ఎందుకో. మేము చేస్తె సంసారం..వేరే వాల్లు చేస్తె వ్య‌భిచారం ఇది చంద్ర‌బాబు నీతి. జనం ఆ పార్టీని చూసి నవ్వు కుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -