చంద్రబాబు అండ్ బ్యాచ్ సాధించిన ఒక విజయం ఇప్పుడు పరాజయంగా మారుతోందా? చంద్రబాబుతో పాటు ఆయనను పరోక్షంగా అభిమానిస్తూ ఉండే జెపి, జెడి లక్ష్మీనారాయణలాంటి వాళ్ళు, పచ్చ మీడియా జనాలందరూ జగన్‌పై వేసిన ఒక ముద్ర ఇఫ్పుడు మరుగునపడిపోతోందా? విష ప్రచారం పుణ్యమాని వెనుకంజ వేసిన జగన్ అభిమానులకు ఇప్పుడు పూర్తి ధైర్యం వచ్చేసిందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం అన్ని కాలేజీల క్యాంపస్‌లలోనూ సభలు ఏర్పాటు చేశాడు జగన్. ఆ సభలకు వెళ్ళిన స్టూడెంట్స్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని కూడా విమర్శించాడు చంద్రబాబు……ఒక దొంగ, క్రిమినల్ సభకు విద్యార్థులు, యువత వెళ్తుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారని తన స్థాయి దిగజార్చుకుని మరీ ప్రతిపక్ష నాయకుడి హోదాను కూడా చూడకుండా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రజలను కూడా తప్పు పట్టాడు. చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ నాయకులు, పచ్చ మీడియా జనాలు మొదటి నుంచీ కూడా ఇలాంటి ప్రచారంతోనే కొంత వరకూ సక్సెస్ అయ్యారు. జగన్‌ని అభిమానించడమంటేనే అదేదో బూతు అన్నట్టు, అవినీతి అన్నట్టు ఘోరమైన విషప్రచారం చేశారు. అయితే నాలుగేళ్ళుగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉండడం, అన్నింటికీ మించి అధికారంలోకి రావడం ఖాయం అని తెలిసి కూడా 2014 ఎన్నికల్లో రుణమాఫీలాంటి దొంగ హామీలు ఇవ్వకపోవడం, పదవి పోతుందని తెలిసి కూడా పార్టీలో చేర్చుకునే ముందు శిల్పా చక్రపాణిరెడ్డిలాంటి నాయకుల చేత పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవడంలాంటివి జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలకు చూపించాయి. అన్నింటికీ మించి ఓటుకు కోట్లుతో దొరికిపోవడం, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడం, వైఎస్ ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేసి మొదటి సంతకానికి తెచ్చిన విలువను చంద్రబాబు కాలరాయడం లాంటివి జనాలను ఆలోచింపచేశాయి. రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని ఊరూ వాడా ప్రచారం చేసిన చంద్రబాబు…….తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అమలుకు కమిటీ వేస్తూ తొలిసంతకం చేసి ప్రజలను దారుణంగా వంచించాడు. ఇక ఆ తర్వత కూడా ప్రత్యేక హోదా విషయంలోనూ బాబు వ్యక్తిత్వం లేని నాయకుడిగా మాటలు మార్చాడు. అవినీతితో సహా, మద్యపానం, అమ్మాయిలపై అఘాయిత్యాలు లాంటి అన్ని విషయాల్లో బాబు అండ్ కో అందరూ కూడా పూర్తిగా వ్యక్తిత్వాలను కోల్పాయారు.
ఈ విషయాలన్నీ కూడా దొంగ హామీలివ్వకుండా, నిజాయితీగా రాజకీయాలు చేసిన జగన్‌కి కలిసొచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయి చంద్రబాబు అభిమానిని అని చెప్పుకోవడానికి ఆయన అభిమానులు ఇబ్బందిపడుతున్న పరిస్థితి. అయితే జగన్ అభిమానులు మాత్రం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోసాని, పృథ్వీ లాంటి సినిమా జనాలతో పాటు అన్ని రంగాల్లో ఉన్న జగన్ అభిమానులు కూడా ఇప్పుడు జగన్ మా నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. పార్టీ ఫిరాయింపులు, ఎక్కువ కాలం ప్రజల మధ్యనే ఉండడం, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని కోరుకోకపోవడం లాంటివి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగన్‌ని నీతిపరుడైన నాయకుడిగా ప్రత్యేకగా నిలబెడుతున్నాయి. పార్టీలోకి వచ్చేవాళ్ళు కచ్చితంగా పదవికి రాజీనామా చేసి రావాల్సిందే, అధికారం కోసం అబద్ధపు హామీలు ఇవ్వను అని చెప్పిన నాయకుడు ఇంకొకరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేడు మరి. ఇక అత్యంత ఎక్కువ కాలం ప్రజల మధ్య ఉన్న నాయకుడిగా జగన్‌ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అందుకే ఇప్పుడు జగన్ అభిమానులందరూ కూడా నేను జగన్ అభిమానిని అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
