Monday, May 6, 2024
- Advertisement -

దరిద్రం వెంటాడకూడదనుకుంటే ఇలా చేయకండి..

- Advertisement -

ప్రతిఒక్కరు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా, సిరిసందలతో లైఫ్ ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అయితే జీవితంలో బ్యాడ్ లక్, పేదరికం దరిచేరకుండా ధనవంతులుగా, ఆనందంగా ఉండాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయరాదట. నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో చేసే తప్పిదాల వల్ల కూడా బ్యాడ్ లక్ వెంటాడుతుందని నారద పురాణం చెబుతోంది. మరి ఆ పురాణం ప్రకారం చేయకూడని ఆ పనులేంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉందాం..!

తినే ఆహారాలు ఏవైనా నేల మీద పడినప్పుడు వాటిని తొక్కడం కానీ, లేదా తినే ప్లేట్ మీద అడుగు పెట్టడం కానీ జరిగితే దరిద్రం వెంటాడుతుందట. అవి పొరపాటున జరిగినా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇంటిని శుభ్రం చేసే సమయంలో, ఇంటిని మాపింగ్ చేస్తున్నప్పుడు మురికి నీళ్ళు శరీరం మీద పడితే దరిద్ర దేవత వెంటాడుతుందట. స్మశానంలో దహన సంస్కారం చేసేటప్పుడు వచ్చే పొగ పీల్చితే పేదరికం, దురదృష్టాన్ని ఆహ్వానించినట్లేట.

శవాన్ని ముట్టుకున్నా, శవాన్ని చూసి వచ్చిన తర్వాత వెంటనే తల స్నానం చేయాలట లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుందట. దహన సంస్కారం చేయడానికి సిద్దంగా ఉంచిన ఉడ్ ను తాకినా అరిష్టాలు కలుగుతాయట. దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు తాకిన వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. అలాగే చినిగిపోయిన చాపల మీద పడుకోవడం, రోలు తిరగబడడం, సంబంధంలేని వ్యక్తుల అస్తికలు అంటే ఎముకలు తాకడం వంటివి చేసినా బ్యాడ్ లక్ వెంటాడే ప్రమాదం ఉంది. కాబట్టి పొరపాటున కూడా ఈ పనులను చేయకుండా ఉండడం మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -