Thursday, March 28, 2024
- Advertisement -

నా జీవితం ఇలా అవడానికి కారణం అదే : సుధాకర్

- Advertisement -

హీరోగా, విలన్ గా, కమెడియన్ గా చాలా సినిమాలే చేశాడు సుధాకర్. ఆయన ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జన్మించాడు. ఇంటర్ కంప్లీట్ కాగానే వెంటనే సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లి ఫిలిం ఇనిస్టుట్యూట్ లో చేరాడు. తర్వాత భారతీరాజా సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే సినిమాని బాపు దర్శకత్వంలో తూర్పు వెళ్లే రైలు గా తెలుగులో తెరకెక్కించారు. దాంతో సుధాకర్ కి ఇక్కడ కూడా హిట్ లభించింది. 45తమిళ సినిమాల్లో హీరోగా చేశాడు.

రాధికతో కలిసి 18సినిమాల్లో హీరోగా నటించాడు. అప్పట్లో వీరి కాంబినేషన్ కి తమిళంలో మంచి క్రేజ్ ఉండేది. ఇక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ సమయంలో చిరంజీవి,సుధాకర్,హరిప్రసాద్ ,నారాయణ మూర్తి,నారాయణరావు ఒకే రూమ్ లో ఉండేవారు. వీళ్లలో ముందుగా సినిమా ఛాన్స్ కొట్టిన సుధాకర్ తమిళ సినీ రాజకీయాల్లో ఇమడలేక తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఊరికి ఇచ్చిన మాట, భోగిమంటలు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా.. విలన్ గా రాణించాడు.

నేను కమ్యూనిజం భావాలతో ఉండేవాడిని. తమిళనాట రాజకీయాల్లో ఎంజీఆర్ పక్షాన ప్రచారం చేయడానికి పార్టీలో చేరమని పిలుపు వస్తే.. తిరస్కరించాను. దాంతో తమిళంలో నేను చేస్తున్న సినిమాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాను. దాంతో నాకు అవకాశం ఇచ్చిన భారతీరాజా ఇక్కడ ఇలాంటి రాజకీయాలే ఉంటాయి. నువ్వు తెలుగు పరిశ్రమకు వెళ్ళు.. మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. దాంతో ఇక్కడకు వచ్చి మంచి చిత్రాలు చేసి అర్దికంగా మళ్లీ ఎదిగాను అని సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -