Saturday, April 20, 2024
- Advertisement -

జ‌గ‌న్ అస్తులు స‌రే ఓటుకు నోటు కేసుప‌రిస్థితి ఏంది…?

- Advertisement -

చంద్ర‌బాబు మాట‌లు చూస్తె నేను ఏమి మాట్లాడినా చెల్లుతాద‌నుకుంటారు. త‌మ పార్టీలో ఉన్న అవినీతి ప‌రుల‌గురించి మాట్లాడ‌కుండా జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌గురించి బాబు తెగ మాట్లాడుతుంటారు. నేను చెప్పిందే నిజం దాన్ని అంద‌రూ న‌మ్మాలి అని మాట్లాడుతుంటారు. తాజాగా మ‌రో సారి జ‌గ‌న్ అక్ర‌మాస్తులను స్వాధీనం చేసుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ఈమాటలు బాబు మొద‌టినుంచి అంటూ క‌ల‌లు కంటూనె ఉన్నారు.

అవినీతిపరుల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెబుతూ, జగన్‌ పేరుని చంద్రబాబు నిత్యం నామ‌స్మ‌ర‌ణ చేయ‌డం చూశాం. అందులో కొత్తేమి కాదు. జగన్‌ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబు చెబుతూనే వున్నారు. ఇప్పటిదాకా, ఆస్తుల స్వాధీనం ఏమన్నా జరిగిందా.? అంటే, అదీ లేదాయె. ఇదంతా జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డానికి త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని బాబుతోపాటు అంద‌రికి తెలుసు.

అసలంటూ అక్రమాస్తులపై కోర్టులో విచార‌న జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ కోర్టు గాని జ‌గ‌న్‌ను దోషి అని ప్ర‌క‌టించ‌లేదు. చంద్రబాబు అయ‌న ప‌రివారం అప్పుడే ‘ఆస్తుల స్వాధీనం’ అంటూ ప్రచారం షురూ చేసేశారు. మూడున్నరేళ్ళుగా ఇదే తంతు. తాజాగా మరోమారు చంద్రబాబు ‘ఆస్తుల స్వాధీనం’ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

వాస్త‌వానికి ఆస్తుల స్వాధీనం’ అనే చర్య చేపట్టాల్సి వుంటే ముందుగా అది చంద్రబాబుతోనే మొదలవ్వాలేమో.! ఎందుకంటే, ఓటుకు నోటు కేసులో, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్కయిపోయారు. అందులో ఒకాయన రేవంత్‌రెడ్డి, రెడ్‌ హ్యాండెడ్‌గా తెలంగాణ ఏసీబీకి దొరికిన విషయం విదితమే. ఈ మొత్తం వ్యవహారానికి ‘బ్రీఫింగ్‌’ చేసింది స్వయానా చంద్ర‌బాబుగారాయా.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బుక్కయ్యాక, అతన్ని రాజకీయంగా ప్రమోట్‌ చేసింది, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కట్టబెట్టిందీ చంద్రబాబేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . గురవింద గింజ సంగతేమోగానీ, చంద్రబాబు చెప్పే నీతులకీ ఆయన వెనకాల ఉన్న అవినీతి మ‌చ్చ‌ల నేత‌లు క‌నిపించ‌రు.ఏమ‌న్నంటె అదొక్క‌టి అడ‌క్కు అంటారు. ఇది బాబు నీత‌వంత‌మైన రాజ‌కీయం, ప‌రిపాల‌నా. బాబుకు డ‌ప్పుకొట్టే వార్తా చాన‌ల్లు ఉన్నంత వ‌ర‌కు ఆయ‌న అంతె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -