Friday, May 10, 2024
- Advertisement -

వ‌చ్చే జ‌న్మ‌లో మీరు ఏజీవిగా పుడతారో తెలుసుకోండి.

- Advertisement -

భూలోకంలో పుట్టిన ప్ర‌తీ ప్రాణి గిట్టక మానదు… గిట్టిన ప్ర‌తీ జీవి పుట్టక మానదు భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణ‌డు ఏనాడో చెప్పారు. ఇదీ హిందూ ధర్మం. మ‌నిసి చేసిన కర్మఫలం ఆధారంగా పునర్జన్మ ఉంటుందని హిందూ ధర్మం చెబుతోంది.

మరి ఈ జన్మలో మనుషులుగా పుట్టిన మనం వచ్చే జన్మలో ఎలా పుడతామో తెలుసుకోవాలనే ఆస‌క్తి ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. అది స‌హ‌జం. అది తెలుసుకోవాలంటే మనం ఈ జన్మలో చేసిన పాపాలేంటో గుర్తు చేసుకోవాలి.భ‌యంగా ఉదా..! మ‌నిషి జ‌న్మ ఎత్తినాక ఇది ఎవ‌రికైనా త‌ప్ప‌దు.

ఈ జన్మలో ధాన్యం దొంగిలిస్తే వచ్చే జన్మలో ఎలుకగా, పందికొక్కుగా పుడతారట. ఇంకా ఆ పాపం పోకపోతే అప్పుడు కుక్కలా పుడుతారట. అన్నను కావాలనే తప్పుబట్టి, నిందించిన తమ్ముడు కొంగలా పుడతాడట. చేసిన మేలును మరచిపోయిన వాడు యమలోకంలో దారుణమైన హింస అనుభవిస్తాడట. డబ్బు విషయంలో నమ్మకద్రోహం చేసినవాడు చేపగా పుడతాడట.

అన్నం, పాలు, పెరుగు, నేయి దొంగిలిస్తే దోమలు, ఈగలుగా పుడతారట. ఇనుము, వెండి, బంగారాలను దొంగిలిస్తే కోతి, కాకి, గువ్వ, పేడ పురుగల్లా పుడతారట. ఇక భార్య కాకుండా ఇతర స్త్రీలను ఆశించేవాడు తోడేలు, రాబందు, గద్దగా జన్మిస్తాడట. ఈ పాపాలను తగ్గించుకునే మార్గాలు కూడా ఉంటాయట. న్యాయంగా సంపాదించిన సొమ్ముతో దాన ధర్మాలు చేస్తే ఈ పాపాలు తగ్గుతాయట.

కాబట్టి ఇప్పటి వరకూ మీరు చేసిన తప్పులు గుర్తు తెచ్చుకోండి. ఇక పాపాలు చేయ‌కుండా ఆ పాప భారం తగ్గించేందుకు దానాలు చేయండి.. తద్వారా వచ్చే జన్మలో మంచి జన్మ పొందుతారు. ఇవన్నీ యమధర్మరాజుకు బృహస్పతి చెప్పిన జన్మ రహస్యాలు. అందుకే ముందుగానే మేలుకొని పాపభారం తగ్గించుకుంటే మంచిది. ఏమంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -