Sunday, May 12, 2024
- Advertisement -

హోదా ఉద్యమాన్ని అణచివేస్తూ ఎపికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు..?

- Advertisement -

‘ప్రత్యేక హోదా డిమాండుతో చలో అసెంబ్లీ కి తరలుతున్న ఉద్యమ కారులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్భందించడాన్ని-దగాకోరు కేంద్రంతో రాష్ట్రం కుమ్మక్కు కి అధికార ప్రకటనగా నేను అర్ధం చేసుకుంటున్నాను‬’…….ఇదీ ఈనాడుతో సహా ఎన్నో మీడియా సంస్థల్లో జర్నలిస్ట్‌గా వర్క్ చేసిన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆవేధనతో సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్. స్వచ్ఛంధ సంస్థలు ప్రత్యేక హోదా కోసం మరోసారి పోరుబాట పట్టాయి. కమ్యూనిస్టులు మద్ధతు పలికారు. వైస్పార్ పార్టీ కూడా హోదాకు మధ్ధతు పలికింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరులో భాగం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలన్నా, చెయ్యాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ మద్ధతు తెలపలేదు. ఇక చంద్రబాబుతో సహా టిడిపి జనాలు, ఆ పార్టీ భజన మీడియా మొత్తం కూడా ప్రత్యేక హోదా పోరుకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.

ఇక్కడే తెర వెనుక విషయాలు ఏంటి అన్న విషయం అర్థం కావడం లేదు. మోడీతో పోరాటం తర్వాత, కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ కూడా తెచ్చుకోలేని దుస్థితి చంద్రబాబుది. కూరలో కరివేపాకు అంత విలువ కూడా మోడీ చంద్రబాబుకు ఇవ్వడం లేదు అన్నది వాస్తవం. కానీ చంద్రబాబు మాత్రం తనపై ఉన్న కేసుల భయమో లేక మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే జగన్‌కి దగ్గరవుతాడన్న బెదురో తెలియదు కానీ మోడీకి పూర్తిగా సాగిలపడిపోయాడు. ఆయనతో పాటు ఆయన పార్టీ నాయకులు, భజన మీడియా బృందాలన్నిందీ కూడా అదే పరిస్థితి. వాళ్ళు అడగలేరు సరే…..కానీ అడిగేవాళ్ళను ఎందుకు అడ్డుకుంటున్నట్టు? ప్రత్యేక హోదా అంటూ ఎవ్వరూ మాట్లాడకుండా, మోడీని పల్లెత్తు మాట అనకుండా చేస్తానని చంద్రబాబు ఏమైనా మోడీకి మాట ఇచ్చాడా? ఆంధ్రప్రధేశ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చింది? మాట్లాడితే అభివృద్ధికి అడ్డుపడిపోతున్నారు అని జగన్‌తో సహా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే అందరిపైనా విరుచుకుపడిపోయే చంద్రబాబు ప్రత్యేక హోదా పోరును అణచివేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కడం ఎంతవరకూ న్యాయం. అయినా ప్రత్యేక హోదా పోరాటం విజయవంతం అయితే చంద్రబాబుకు ఏంటి నష్టం? హోదా ఉద్యమం అంటే చాలు…..ఆ ఉద్యమాలన్నీ అట్లర్ ఫ్లాప్ అని టిడిపి భజన మీడియా సంస్థలన్నీ ఎందుకు వార్తలు ప్రచురిస్తున్నాయి? రాష్ట్ర పోలీసులు ఎందుకు ముందుగానే గృహనిర్భంధాలకు, అరెస్ట్‌లకు తలపడుతున్నారు. సిసలైన ఆంధ్రప్రదేశ్ ద్రోహులని వీళ్ళను ఎందుకు అనకూడదు?

కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతున్న ద్రోహులు అని అనొచ్చు. ఎందుకంటే హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని హోదాకు మంగళం పాడేశారు. ఆ తర్వాత ప్యాకేజీ నిధులు కూడా రావడం లేదని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా ప్యాకేజ్ నిధులు రావడం లేదని చంద్రబాబు చాలా సార్లు మాట్లాడారు. ప్యాకేజ్ నిధులు అందడం లేదని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి కూడా వాపోయింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయమే చేస్తోంది. ఆ విషయాన్ని చంద్రబాబు, ఆయన భజన మీడియా సంస్థలే చెప్తూ ఉంటాయి.

రాజధాని నిధులు, రైల్వే జోన్…అన్నింటా అన్యాయమే. ఈ విషయాలన్నీ చంద్రబాబు కూడా చెప్తూ ఉంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై పోరాడటానికి వైకాపా, కమ్యూనిస్టులు, స్వచ్ఛంధ సంస్థలు, యువజనాలు..ఇలా ఎవరు ముందుకు వచ్చినా ముందుగానే అరెస్టులు చేయించి ఉక్కుపాదంతో అణచివేయిస్తూ ఉంటాడు చంద్రబాబు. హోదా పోరు అట్టర్ ఫ్లాప్….అట్టే మాట్లాడితే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడొద్దు అని టిడిపి మీడియా సుద్దులు చెప్తూ ఉంటుంది. సఖ్యతగా ఉండి మూడున్నరేళ్ళకు పైగా చంద్రబాబు అండ్ బ్యాచ్ సాధించిందేంటి? కేంద్రం నుంచి లోటు నిధులు తెచ్చుకున్నారా? రాజధాని నిధులు తెచ్చారా? పోలవరం నిధులు వచ్చాయా? ప్యాకేజ్ తెచ్చారా? రైల్వే జోన్ వచ్చిందా? మోడీ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రయోజనాన్ని పొందలేకపోయాడు చంద్రబాబు.

విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా తెచ్చుకోలని దారుణమైన వైఫల్యం చంద్రబాబుది. అయినప్పటికీ వ్యక్తిగత స్వార్థంతో కేంద్రప్రభుత్వంతో లాలూచీ పడ్డారన్నది వాస్తవం. అలాగే ప్రతిపక్ష నాయకులతో సహా ఇతర పార్టీల నాయకులు, ప్రజలు కూడా నోరెత్తకుండా చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు తీసుకున్నట్టుగా ఉంది. అదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చంద్రబాబు అండ్ ఆయన భజన మీడియా, ఆయన పార్టీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి. మూడున్నరేళ్ళలో ఏమీ తీసుకురాలేని వాళ్ళు ఇకపై వచ్చే ఎన్నికల సంవత్సరంలో కూడా ఏమీ తీసుకురాలేరు అన్నది వాస్తవం. కాకపోతే బిజెపితో పొత్తు ఉంటే మాత్రం ఎన్నికలకు ముందు మరోసారి మోడీ చేత భారీ హామీలు ఇఫ్పటిస్తారు? చంద్రబాబు కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ హామీలు మరోసారి గుప్పిస్తారు. బిజెపితో పొత్తు తెగిపోయిందా? 2014 నుంచీ నేను బ్రహ్మాండంగా పాలించాను…..బిజెపి అన్యాయం చేసింది అని మోడీని తెగనాడి సానుభూతితో ఆంధ్రప్రదేశ్ ఓట్లు కొల్లగొట్టడానికి చూస్తారు.

ఐదేళ్ళుగా మోడీకి సాగిలపడి ఆంధ్రప్రదేశ్ఙకి చంద్రబాబు అన్యాయం చేశాడు అన్న విషయాన్ని దాచేస్తూ మోడీ చంద్రబాబుకు అన్యాయం చేశాడని చెప్పి ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా ఎలాగూ ఉందిగా……. 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాలకు, అభూతకల్పనలు, గాల్లో హామీలకు పట్టం కడతారేమో చూడాలి. 2014 ఎన్నికల ముందు నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు చేస్తున్నది మాత్రం ఆ ప్రచార ఆర్భాటపు వ్యవహారాలే. కావాలంటే నిన్నటి ఈనాడు పత్రికలో వచ్చినా ఊర్లకు ఊర్లు వలసపోతున్నాయి అన్న వ్యాసం…. అలాగే ఈరోజు ఈనాడులో వచ్చినా సింగపూర్, అమెరికా యాత్రలతో అసలే లోటు బడ్జెట్‌లో ఉన్నఆంధ్రప్రదేశ్‌పైన మరింత భారం పడడం తప్పించి ఏమీ ప్రయోజనం లేదన్న వ్యాసం కూడా చదవండి…….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -