Saturday, May 4, 2024
- Advertisement -

విరాళాలు…….. పచ్చ డ్రామాలతో మరోసారి హీరో అనిపించుకున్న జగన్

- Advertisement -

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని దాచిపెట్టి పదవిపై ఆశలేదు, అధికారంలేకపోయినా ఒకే అనేలాంటి డ్రామా డైలాగులు జగన్ ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్…….అంతకుముందు చిరంజీవి కూడా ముఖ్యమంత్రి పదవి, అధికారం కోసమే రాజకీయాలు చేశారు, చేస్తున్నారు అన్నది నిజం. అయితే వాళ్ళెవ్వరూ కూడా నిజాయితీగా ఆ విషయం ఒప్పుకోరు……చెప్పరు. ఇక చంద్రబాబు నాయుడు అయితే పదవి అంటే ఇష్టమే లేదని నంగనాచి కబుర్లు చెప్తాడు. అంత ఇష్టం లేనివాడు రుణమాఫీలాంటి అబద్ధపు హామీలిచ్చి మరీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చే కుయుక్తులు ఎందుకు పన్నినట్టు?

ఇప్పుడు కేరళకు విరాళాల విషయంలో కూడా మరోసారి చంద్రబాబు అబద్ధపు డ్రామాలు, పచ్చ పార్టీ నాటకాలను గమనిస్తున్నారు. అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. జగన్ స్వయంగా తన చేతి నుంచి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. మెగా ఫ్యామిలీ అందరితో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరే ఎవ్వరూ కూడా ఈ స్థాయిలో డొనేట్ చేసింది లేదు. ఇక చంద్రబాబు అయితే తన జేబులో నుంచి నయాపైసా ప్రకటించింది లేదు. కనీసం బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దినదిన ప్రవర్ధమానం చెందుతున్న హెరిటేజ్ నుంచి కూడా ఏమీ ప్రకటించలేదు. ఇక సుజనా చౌదరితో సహా అందరూ కూడా ప్రజల సొమ్మును విరాళంగా ఇస్తూ అదేదో సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా అబద్ధపు నాటకాలు ఆడుతున్నారు. ఆ నాటకాలను ఆంధ్రజ్యోతితో సహా ఇతర పచ్చ మీడియా సంస్థలన్నీ ఆహా……ఓహో అని పొగుడుతున్నాయి.

జగన్ కోటి రూపాయలు ఇచ్చిన విషయాన్ని మాత్రం ప్రచారంలోకి రానీయకుండా జాగ్రత్తపడుతున్నాయి. అంతకంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే మానవతా దృక్పథంతో జగన్ సహాయం ప్రకటిస్తే అదంతా అవినీతి సొమ్మే అని అడ్డగోలు ఆరోపణలు చేయడం. జగన్ మంచి చేసినా, ఏమీ చేయకపోయినా పదే పదే జగన్‌ని తక్కువ చేయడం కోసం అబద్ధపు డ్రామాల రాజకీయం……….ఇక బాబు, లోకేష్‌లను జాకీలేసి లేపడానికి వాళ్ళిద్దరూ గొప్పవాళ్ళకే గొప్పవాళ్ళను అనుక్షణం డబ్బా కొట్టే మరోరకం రాజకీయ డ్రామాలతోనే పచ్చ బ్యాచ్ జనాలు ప్రజల ముందు జగన్‌ని రియల్ హీరోగా నిలబెడుతున్నారా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అబద్ధపు డ్రామాలతో మరోసారి జగన్‌ని ప్రజల ముందు హీరోని చేసేశారని టిడిపి నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం వ్యక్తిగతంగా కూడా ఎంతో కొంత ప్రకటించాలని చంద్రబాబుతో చెప్పిన సీనియర్ నేతలతో చంద్రబాబు కటువుగా మాట్లాడాడన్న వార్తలు కూడా విస్తుగొలుపుతున్నాయి. రాజకీయాల వరకూ కంటికి కనిపిస్తున్న నిజాలను విశ్లేషిస్తే మాత్రం జగన్ నిజాయితీ, చంద్రబాబు అబద్ధపు డ్రామాలు ఇట్టే అర్థమైపోతాయయని సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -