Sunday, May 19, 2024
- Advertisement -

ఆయ‌న ప్ర‌త్యేక‌హోదా నినాదంతో అధికారం…. ఈయ‌న అధికారంకోసం కొత్త‌జిల్లాల నినాదం..

- Advertisement -

ఏపీలో రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప ఎన్నిక ప‌క్క‌న‌పెడితే.. వారి నోట స‌రికొత్త వాగ్దానాలు వినిపిస్తున్నాయి.నంద్యాల‌లో జ‌రిగిన వైసీపీ బ‌హిరంగ స‌భ‌లో ఆపార్టీ అధినేత జ‌గ‌న్ కొత్త నినాదానికి తెర‌లేపారు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.దీని వెనుక పెద్ద‌వ్యూహ‌మే ఉన్న‌ట్లు క‌నిపిస్తోందే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర‌విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్రాణవాయువు లాంటిది ప్ర‌త్యేక‌హోదా. కాంగ్రెస్ పార్టీ ఐదు సంవ‌త్సారాలు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న వ్యాఖ్య‌ల‌ను ఖండించిన భాజాపా సీనియ‌ర్ నాయ‌కులు వెంక‌య్య‌నాయుడు… అదే రాజ్య‌స‌భ‌లో ఐదు సంవ‌త్స‌రాలు కాదు ప‌ది సంవ‌త్సారాలు ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేశారు. అందుకు అనుగునంగా హామీని విభ‌జన బిల్లులో పెట్ట‌కుండా అప్ప‌టి పీఎం మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ సాక్షిగా ప‌ది సంవ‌త్సరాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా భాజాపా అధికారంలోకిరాగానె స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తాన‌ని వాగ్దానం చేశారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనుకున్న‌ట్లు గానె ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చి నరేంద్ర‌మోదీ ప్ర‌ధాని అయ్యారు.న‌వ్యాంధ్ర‌లో టీడీపీ-భాజాపా కూట‌మి క‌ల‌సి పోటీచేసి ఇటు రాష్ట్రంలో అదికారంలోకి వ‌చ్చారు. రెండు పార్టీలు రాష్ట్రంలోను,కేంద్రంలోను అదికారాన్ని పంచుకుంటున్నాయి. వైసీపీ అధికారంలోకి వ‌స్తాద‌నుకున్న టైంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది.కూట‌మికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు ప‌వ‌న్‌.

రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత పార్టీల్లో మార్పులు వ‌చ్చాయి. అధికారంలోకి వ‌స్తానె ప్ర‌త్యేక‌హోదాను ఇస్తామ‌ని చెప్పిన ఎన్‌డీఏ ప్లేటు పిరాయించింది.దానితో స‌మానమైన ప్ర‌త్యేక ప్యాకేజి ఇస్తామ‌ని కొత్త‌ప‌ల్ల‌వి అందుకున్నాయి. దీంతో ప‌రిస్థితులు తారుమార‌య్యాయి. ప్ర‌త్యేక‌హోదాకావాల‌ని ఉద్య‌మాలు జ‌రిగాయి.

ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కోవ‌డంతో కేంద్రం ద‌గ్గ‌ర డిమాండ్ చేయ‌లేని ప‌రిస్థితి.కేంద్రంఇచ్చే ప్ర‌త్యేక ప్యాకేజికి ఒప్పుకుంది ఏపీ ప్ర‌భుత్వం. దాంతో రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌న్నీ విమ‌ర్శ‌లు గుప్పించాయి. కేంద్రం ద‌గ్గ‌ర ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టార‌నె విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ప్ర‌త్యేక హోదాపై యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ప‌వ‌న్ కూడా టీడీపీ-బాజాపా కూట‌మిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కూట‌మికి దూరంగా ఉంటున్నారు. త‌ర్వాత జ‌న‌సే పార్టీని స్థాపించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు.ప్ర‌త్యేక హోదా ఏపీ ప్రాణమ‌ని ప్ర‌క‌టించారు. అయితే ప‌వ‌న్ ఇప్ప‌టికి ప్ర‌త్యేక‌హోదా అంటూనె బాబుతో క‌ల‌సి సాగుత‌న్నారు.

ఇక వైసీపీ అదినేత జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తె ప్ర‌త్యేక‌హోదా, రైల్వే డివిజ‌న్ కావాల‌ని ఉద్య‌మం చేయ‌డంతోపాటు అవ‌స‌రం అయితే ఎంపీలంద‌రు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు…కొద్ది రోజుల‌క్రిక‌తం జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిసిన త‌ర్వాత స్వ‌రంలో మార్పు వ‌చ్చింది. అవ‌స‌రం అనుకుంటె ఎప్పుడైనా రాజీనామ చేస్తార‌ని మాట మార్చారు. ప్ర‌త్యేక హోదాకోసం పోరాటం సాగుతుంద‌ని చెప్తున్నా మ‌రోవైపు…జ‌గ‌న్‌కూడా హోదాను కేంద్రం ద‌గ్గ‌ర తాక‌ట్టుపెట్టార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాజాపా-వైసీపీ క‌ల‌సి పోటీ చేస్తాయ‌నె బ‌ల‌మైన సంకేతాలు ఇప్ప‌టికే వెలువ‌డ్డాయి. రాష్ట్ర‌ప‌తి,ఉప‌రాష్ట్ర‌ప‌తి విష‌యంలో వైసీపీ బేష‌రుతుగా మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌స్తుతం ఏపీలో ఎవ‌రూ ప్ర‌త్యేక హోదా గురించి త‌క్కువ‌గా మాట్లాడుత‌న్నారు.

వైసీపీ అధినేత ఇప్పుడ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. పార్టీ అధికారంలోకి వ‌స్తె కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ప్ర‌త్యేక హోదాను ప్ర‌జ‌ల‌నుంచి పూర్తిగా దృష్టి మ‌ర‌ల్చ‌డానికే జ‌గ‌న్ ఈనిర్న‌యం ప్ర‌క‌టించార‌నే వాస్త‌వం తెలుస్తోంది. ఈహామి అటు బాబులో గుబులు రేపుతోంది.కొత్త జిల్లాలు ఏర్ప‌డితే ప్ర‌త్యేక‌హోదా పూర్తిగా మ‌రుగున ప‌డిపోతుంది ప్ర‌ల‌జు దీని గురించి ప్ర‌స్తావచ‌రు. ఇటు ప్ర‌త్యేక హోదాను….అటు బాబును ఇర‌కాటంలో ప‌డేవారు.

అయితే దీనివెనుక భారీ వ్యూహ‌మే క‌నిపిస్తోంది. ఎన్‌డీఏ, వైసీపీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీ చేస్తాయ‌నె ప‌వ‌నాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌నుంచి వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌కుండా …కొత్త‌జిల్లాల నినాదాన్నిబ‌లంగాతీసుకెల్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు కొత్త జిల్లాల నినాదం అందుకున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఏదైనా ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌న‌కు ఇది నాంది ప‌లుకుతుంద‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -