- Advertisement -

ఐపీఎల్ కొత్త రూల్స్ ఇవే!

- Advertisement -

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది బీసీసీఐ. మ్యాచ్ సమయంలో మైదానంలో సంచరించే ఆటగాళ్ల సంఖ్యపై కొత్త పరిమితులు విధించింది.కొత్త నిబంధనల ప్రకారం, ఒక మ్యాచ్‌కు సంబంధించిన టీమ్ షీట్‌లో ఉన్న 16 మందికే మైదానంలో తిరగడానికి అనుమతి ఉంటుంది.

ఇందులో ప్లేయింగ్ ఎలెవన్ (11 మంది),5 ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్ మాత్రమే. మిగతా ఆటగాళ్లకు నిషేధం.సాధారణంగా ఒక ఐపీఎల్ జట్టులో 25 మంది ఉంటారు. అయితే మిగిలిన ఆటగాళ్లు డగౌట్‌లోనే ఉండాలి.మైదానంలోకి రావడం, డ్రింక్స్ తీసుకెళ్లడం, ప్లేయర్లకు మెసేజులు ఇవ్వడం నిషేధం.

టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఇటీవలే ఈ ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్లేయింగ్ XIకి బయట ఉన్న ఐదుగురికి మాత్రమే కొంతవరకు మైదానం దగ్గర సంచరించే అవకాశం ఉంటుంది. మిగతావారు బౌండరీ లైన్ దాటి రావడం పూర్తిగా నిషేధం.

యాంటీ-డిస్క్రిమినేషన్ కోడ్ విస్తరణ: ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకు కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత కూడా 3 నెలలు ఈ నియమాలు వర్తిస్తాయి.ఉల్లంఘనలకు 4 మ్యాచ్‌ల నిషేధం నుంచి జీవితకాల బ్యాన్ వరకు శిక్షలు.DRS నిబంధనల్లో మార్పు: ఆటోమేటిక్ డబుల్ చెక్ ఉండదు. ప్రత్యేకంగా అడిగితేనే ఇతర అంశాలను పరిశీలిస్తారు

ఈ కొత్త నియమాల ద్వారా మ్యాచ్ సమయంలో మైదానంలో అనవసర రద్దీ తగ్గించడంతో పాటు క్రమశిక్షణను పెంచాలని BCCI లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -