ఐపీఎల్ 2026 వేలానికి టైం దగ్గరపడుతోంది. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ₹43.40 కోట్లు మిగిలి ఉన్నాయి. జట్టు తమ లోయర్-ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను బలపరచాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోచెన్నై టార్గెట్ చేసే ముగ్గురు ఆటగాళ్లు వీరే.
వేలానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను విడుదల చేసి, అతని స్థానంలో సంజు శాంసన్ ను సంతకం చేశారు. సంజు జట్టుకు టాప్ ఆర్డర్‌లో స్థిరత్వం తీసుకురావడంతో పాటు, భవిష్యత్తులో ధోనీకి వికెట్ కీపర్‌గా—అవసరమైతే నాయకుడిగా కూడా—అనుకూలంగా ఉండగలడు.
లియమ్ లివింగ్‌స్టోన్ పైన CSK మరింత దృష్టి పెట్టనుంది. IPL 2025కు ముందు RCB అతన్ని ₹8.75 కోట్లకు దక్కించుకోగా ఈసారి లివింగ్‌స్టోన్‌ను రిలీజ్ చేయగా అతడిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున వెచ్చించనుంది చెన్నై.
అలాగే స్పిన్ యూనిట్‌ను బలపర్చేందుకు చెన్నై శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగను తీసుకునే అవకాశం ఉంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ 2025 మెగా ఆక్షన్‌కు ముందు ₹11 కోట్లకు రవి బిష్నోయిని రిటైన్ చేసింది. కానీ గత సీజన్‌లో ఆయన ప్రదర్శన నిరాశపరిచింది. 11 మ్యాచ్‌ల్లో కేవలం 9 వికెట్లు మాత్రమే తీసుకుని, ఎకానమీ రేటు 10.83. ఇదే కారణంగా LSG ఆయనను విడుదల చేసింది. స్పిన్ విభాగం బలహీనంగా ఉన్న CSK, బిష్నోయిని దక్కించుకునేందుకు ఖచ్చితంగా ఆసక్తి చూపుతుంది.
