Saturday, May 4, 2024
- Advertisement -

ధోనిపై ఫైర్ అయిన మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సేహ్వాగ్‌..

- Advertisement -

ఐపీఎల్‌లో అంపైర్‌తో వాగ్వాదం విషయంలో చెన్నై కెప్టెన్ ధోనీపై విమ‌ర్శ‌లు పంర‌ప‌ర కొన‌సాగుతోంది. ధోనీ తీరును తప్పుబడుతూ కొందరు మాజీలు విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సేహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నోబాల్ విషయమై అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోగా.. అప్పటికే ఔటై చెన్నై టీమ్ డగౌట్‌లో కూర్చుని ఉన్న ధోనీ.. నిబంధనల్ని అతిక్రమించి మరీ మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

ముక్కుసూటిగా వ్యవహరించడంలో ముందుండే సెహ్వాగ్ మాత్రం..ధోనీ తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. చేసిన తప్పును సులువుగా తప్పించుకున్న మహీపై రెండు, మూడు మ్యాచ్‌లైనా నిషేధం వేయాల్సిందని సెహ్వాగ్ అన్నాడు.

ధోనీలాగే మరో జట్టు కెప్టెన్ కూడా ఇలాగే చేసే అవకాశముంటుంది. అలాంటప్పుడు అంపైర్‌కు విలువేముంటుంది. అతనిపై నిషేధం వేస్తే మిగతావారికి భయముండేది, కానీ జరిమానాతో సరిపెట్టారంటూ మండి ప‌డ్డారు.

భారత్‌కి ఆడే సమయంలో ధోనీ ఏరోజూ.. ఇంత ఎమోషనల్ అవ్వలేదని.. దీనిబట్టి.. అతనికి టీమిండియా కంటే.. చెన్నై టీమ్‌పైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు స్పష్టమైందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్ప‌టికే మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -