Thursday, May 23, 2024
- Advertisement -

టాస్ గెలిచి భార‌త్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

- Advertisement -

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. భారత్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింటిలోనూ ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

సామ్ కర్రన్‌కు జట్టులో చోటుదక్కలేదని అతని స్థానంలో బెన్‌స్టోక్స్‌ను టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు జో రూట్ శుక్రవారమే వెల్లడించాడు. ఇక‌ భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాని జట్టులోకి తీసుకున్నాడు. యువ వికెట్‌ కీపర్ రిషబ్ పంత్‌కి కెరీర్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్.

భారత్ జట్టు: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, జో రూట్ (కెప్టెన్), పోప్, జానీ బాయిర్‌స్టో (వికెట్ కీపర్), జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్, అదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -