Saturday, May 11, 2024
- Advertisement -

త్రీ ఇన్ వ‌న్ పృథ్వీషా…

- Advertisement -

భారత యువ సంచలన ఓపెనర్ పృథ్వీ షా వరుసగా రెండో టెస్టులోనూ వెస్టిండీస్ బౌలర్లని ఉతికారేస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో పృథ్వీ షా కేవలం 39 బంతుల్లోనే 8×4, 1×6 సాయంతో హాఫ్ సెంచరీ బాదేశాడు. పృథ్వీ షా బ్యాటింగ్‌పై సోషియ‌ల్ మీడియాలో ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సీనియర్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్న పిచ్‌పై తనదైన శైలిలో అలవోకగా పరుగులు రాబట్టాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(4) మరోసారి నిరాశపరిచాడు. దూకుడుగా ఆడిన షా.. విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఇబ్బందిపెట్టాడు.

శతకం దిశగా దూసుకెళ్తున్న షా దూకుడుగా ఆడే క్రమంలోనే 19వ ఓవర్‌లో వారికేన్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానాన్ని వీడాడు.టెస్టు ఆరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గానూ షా రికార్ట్ సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆడిన తొలి అంతర్జాతీయ టెస్టులోనే షా సెంచరీ చేస్తే.. సచిన్ మాత్రం సెంచరీ కోసం 13 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాల ఆటతీరు గుర్తుకొచ్చేలా 18ఏళ్ల షా బ్యాటింగ్ సాగుతోందని సోషల్‌మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రీజులో ఉన్నంతసేపు షా మెరుపు బ్యాటింగ్, అభిమానుల అరుపులతో మైదానం హోరెత్తిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -