వెస్టిండీస్‌తో జరగబోయే మిగతా మూడు వన్డేలకు 15 మందితో కూడిన భారత జట్టుని ప్రకటించారు సెలక్టర్లు. తొలి రెండు వన్డేలకు దూరమైన ప్రధాన పేస్ బౌలర్లు భువనేశ్వర్‌కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్‌లోకి వచ్చారు. గౌహతి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. విశాఖపట్నం వేదికగా నిన్న రాత్రి ముగిసిన రెండో వన్డేని టైగా ముగించిన విషయం తెలిసిందే.
భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే
Announcement: #TeamIndia for last three ODIs against Windies announced. Jasprit Bumrah & Bhuvneshwar Kumar are back in the side #INDvWI pic.twitter.com/jzuJw4Sana
— BCCI (@BCCI) October 25, 2018
