Thursday, May 16, 2024
- Advertisement -

స్మిత్‌కు షాక్ ఇచ్చిన రాజ‌స్థాన్ రాయ‌ల్ జ‌ట్టు…

- Advertisement -

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వ్వ‌వ‌హారంతో స్మిత్ క్రెకెట్ జీవితం చిక్కుల్లో ప‌డింది. బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డ్డామ‌ని చెప్ప‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియా క‌ఠిన మైన చ‌ర్య‌లు తీసుకొనే ప‌నిలో ప‌డింది. మ‌రో వైపు ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాల్కం టర్న్‌బుల్ కూడా స్పందించ‌డంతో నిబంధ‌న‌ల ప్రకారం జీవిత‌కాలం నిషేధం ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఐసీసీ ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే

ఇదిలా ఉంటే రాజ‌స్థాన్ రాయ‌ల్ జ‌ట్టు యాజ‌మాన్యం భారీ షాక్ ఇచ్చింది స్మిత్‌కు. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ నుంచి స్టీవ్‌ స్మిత్‌ను యాజమాన్యం తప్పించింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించింది.

బాల్ ర్యాంపరింగ్‌కు పాల్పడటంతో పాటు తాము చేసింది చిన్న తప్పు అన్నతీరుగా వ్యవహరించి స్మిత్ క్రీడాస్ఫూర్తిని దెబ్బతీశాడని అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -