Sunday, May 5, 2024
- Advertisement -

సార‌గ తీరంలో చెన్నై, ఢిల్లీ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు… ఫైన‌ల్లో ముంబ‌య్‌ని ఢీకొట్టేదెవ‌రో…?

- Advertisement -

ఐపీఎల్‌ ఫైనల్లో ముంబైతో తలపడే జట్టు ఏదో తేల్చే క్రమంలో అనుభవానికి, యువతరానికి మధ్య పోరు ఆస‌క్తిక‌క పోరుకు రంగం సిద్దం అయ్యింది. తొలి సారి ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న జట్టు ఓ వైపు.. మూడుసార్లు ఛాంపియన్‌ మరోవైపు. ఐపీఎల్‌-12 ఆఖరి అంకంలో మరో ఆసక్తికర పోరుకు వేళైంది. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో దిల్లీ క్యాపిటల్స్‌ నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ విశాక‌లో జ‌ర‌గ‌నుంది.

ఐపీఎల్‌-12 టైటిల్‌ పోరులో ముంబయిని ఢీకొట్టే జట్టేదో తేలిపోనుంది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై.. దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. బలమైన బౌలింగ్‌కు ధోనీ వ్యూహాలు తొడవడంతో చెన్నై సునాయాస విజయాలు సాధిస్తూ వస్తే.. బ్యాటింగ్ బలానికి రబాడ మెరుపు స్పెల్స్ తోడవడంతో ఢిల్లీ సులువుగానే ప్లే ఆఫ్స్ చేరింది.లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై చేతిలో ఓడటం శ్రేయస్ సేనను కాస్త ఇబ్బంది పెడుతున్నా.. ప్రత్యర్థి ఎవరైనా రెచ్చిపోవడమే లక్ష్యంగా బరిలో దిగే ఈ కుర్ర జట్టుకు అదేమంత పెద్ద సమస్య కాకపోవచ్చు

ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తె ముదిరిపోయిన వాళ్లనంత ఒక్కచోట చేర్చి వారికి నాయకత్వం వహిస్తున్న మహా ముదురు మహేంద్రసింగ్ ధోనీనే చెన్నైకు కొండంత అండ. అతడు వికెట్ల వెనుక ఉంటే.. అనామక బౌలర్ కూడా స్టార్‌గా మారిపోతాడు. కీలక సమయాల్లో ఫీల్డింగ్ కూర్పులు, బౌలింగ్ మార్పులు, బ్యాటింగ్ మెరుపులతో ఈ సీజన్‌పై తనదైన ముద్రవేసిన ధోనీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరు కొనసాగిస్తే చెన్నైకి తిరుగుండదు.

ధోని క్రీజులో ఉంటె చివ‌రి ఓవ‌ర్ల‌ల్లో చెప్పాల్సిన ప‌నిలేదు. భుజ బలం ప్రదర్శించడానికి ముందే అతను పిక్కబలం చూపిస్తూ అనూహ్య రీతిలో సింగిల్స్‌ తీయగలడు.కపిల్, సచిన్‌ తర్వాత ప్రతి వేదికను సొంత మైదానంగా మార్చుకోగల స్థాయి ధోనిది మాత్రమే.

ఇక ఢిల్లీ విష‌యానికి వ‌స్తె ఆ జ‌ట్టులో ఉండేదంతా కుర్రాల్లే. యువ సంచలనం పృథ్వీ షాతో కలిసి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నాడు. ఆట‌లో ఎవ‌రో ఒక‌రు స‌క్సెస్ అవ‌డంతో ఢిల్లీ విజ‌యాల బాట‌ప‌ట్టింది. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మున్రో రూపంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉండటం క్యాపిటల్స్‌కు కలిసొచ్చే అంశం. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపెట్టిన పంత్ మరోసారి చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. ఫైన‌ల్లో రోహిత్ సేన‌తో ఢీకొట్ట‌బోయో జ‌ట్లు ఏదో ….?

జట్లు అంచనా..

చెన్నై: ధోనీ(కెప్టెన్), వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, విజయ్, జడేజా, బ్రేవో, చహర్, తాహిర్, హర్భజన్.

ఢిల్లీ: అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, ధవన్, ఇంగ్రామ్/మున్రో, పంత్, అక్షర్, రూథర్‌ఫోర్డ్, పాల్, మిశ్రా, బౌల్ట్, ఇషాంత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -