మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్, ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్‌కు ముందు భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలపై ప్రశంసలు గుప్పించారు. భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో మూడు వన్డేలు మరియు ఐదు టీ20లు ఆడబోతున్నాయి.
విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఆటగాళ్లు చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరఫున ఆడారు. ఇప్పుడు వారు తిరిగి జట్టులోకి వస్తున్నారు కాబట్టి, ఈ సిరీస్ ద్వారా గుర్తుండిపోయే రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్ ప్రారంభానికి ముందు మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించారు.
విరాట్ ఒక ఫెరారీ లాంటివాడు, హై ఆక్టేన్ ప్లేయర్….ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటాడు…అంతేగాదు ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతాడని తెలిపారు. 302 మ్యాచ్‌లు ఆడి 14,000 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో అతని సగటు అద్భుతం. అతని బలం అతని ఫిట్‌నెస్ మరియు ప్రిపరేషన్. నా దృష్టిలో, అతను ఇప్పటికే 2027 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాడని తెలిపారు. టీమ్ ఇండియాకు విరాట్ కోహ్లీ ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో రోహిత్ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు. ODI కెప్టెన్సీని కోల్పోయినప్పటికీ, రోహిత్ ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు.
