ముంబై ఇండియన్స్ కి షాక్.. మలింగ లేడు.. ఎందుకంటే ?

- Advertisement -

ఐపీఎల్ 2020 సీజన్‌ లో ముంబై ఇండియన్స్ కు ఊహించని షాక్ తగిలింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే తొలి మ్యాచ్ లోనే ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనుంది. అయితే ఈ మొదటి మ్యాచ్ కి ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ దూరంగా ఉండనున్నాడు.

అందుకు కారణం ఏంటంటే.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది ఆరంభించబోతున్న లంక ప్రీమియర్ లీగ్ (సీపీఎల్). నిజానికి ఇటీవల ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్‌ని సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ బీసీసీఐ తొలుత ప్లాన్ చేసింది. దాంతో లంక ప్రీమియర్ లీగ్ ని ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ నిర్వహించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ వేసింది. కానీ.. ఊహించని రీతిలో వారం రోజులు ముందే అంటే.. సెప్టెంబరు 19 నుంచే ఐపీఎల్‌ని ప్రారంభించబోతున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించాడు. దాంతో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడే క్రికెటర్లు ఆలస్యంగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

- Advertisement -

మలింగ ముంబై తరుపున సుధీర్ఘకాలంగా ఆడుతున్నాడు. ఇక శ్రీలంకకి చెందిన ఆల్‌రౌండర్ ఇసురు ఉదానా తొలిసారి ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. ఇతన్ని ఆర్సీబీ రూ. 50 లక్షలకి కొనుగోలు చేసింది. దాంతో ఉదాన, మలింగ మొదటి మ్యాచ్ కు దూరమవనున్నారు. కరోనా కారణంగా శ్రీలంక నుంచి యూఏఈలో జరగనున్న ఐపీఎల్ కి వచ్చిన వెంటనే మలింగ, ఉదాన 7 రోజులు క్వారంటైన్‌లో ఉండి.. కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మలింగ ఐపీఎల్ లో 122 మ్యాచ్‌లాడి 177 వికెట్లు తీశాడు.

టీమిండియా తదుపరి ధోనీ రోహితే : రైనా

సెహ్వాగ్‌ లాగా రోహిత్ రాణించగలడా ? సందేహమే : ఇర్ఫాన్ పఠాన్

సచిన్‌ సలహా వల్లే ఉత్తమ టెస్టు క్రికెటర్ అయ్యాను : కోహ్లీ

రిషబ్ పంత్‌ రాణించాలంటే కోహ్లీ ఇలా చేయాలి : పఠాన్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -