- Advertisement -

ఆసీస్ జట్టు నుండి కమిన్స్ ఔట్

- Advertisement -

ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తక్కువ నడుము గాయం కారణంగా భారతదేశం, న్యూజిలాండ్‌తో జరగబోయే వైట్‌బాల్ సిరీస్‌ల నుంచి తప్పుకున్నారు. రాబోయే యాషెస్ సిరీస్ కోసం అతను పూర్తిగా ఫిట్‌గా ఉండడమే లక్ష్యమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అక్టోబర్ 1 నుంచి ఆడనుంది. అనంతరం అక్టోబర్ 19 నుంచి 25 వరకు భారత్‌తో మూడు వన్డేలు, అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ నవంబర్ 21న పర్థ్‌లో ఇంగ్లాండ్‌తో మొదలవనుంది.

కమిన్స్ భారతదేశం, న్యూజిలాండ్‌తో జరగబోయే లిమిటెడ్ ఓవర్స్ సిరీస్‌లకు అందుబాటులో ఉండడు… యాషెస్ కోసం ఆయన బౌలింగ్ ప్రిపరేషన్‌లో భాగంగా రిహాబ్ ప్రణాళికను కొనసాగిస్తాడు అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో పేర్కొంది.

వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ సిరీస్ అనంతరం కమిన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వెస్టిండీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కమిన్స్ నడుము నొప్పితో ఇబ్బంది పడ్డారు. సోమవారం నిర్వహించిన రొటీన్ స్కాన్‌లో ఎముకల ఒత్తిడి (హాట్ స్పాట్) లక్షణాలు కనిపించాయి..దీంతో కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -