Sunday, May 5, 2024
- Advertisement -

కోహ్లీసేన‌ను వెంటాడుతున్న ఓట‌ములు…

- Advertisement -

ఐపీఎల్ 2018 ఆర్‌సీబీకి క‌ల‌సి రావ‌ట్లేదు. కోహ్లీ జ‌ట్టును ఓట‌ములు వెంటాడుతూనే ఉన్నాయి. ఒంటి చేత్తో జ‌ట్టును గెలిపించ‌గ‌ల ఆట‌గాల్లు ఉన్నా ఎట‌ములు త‌ప్ప‌టంలేదు. కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓట‌మి పాల‌య్యింది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ (62 నాటౌట్: 52 బంతుల్లో 7×4, 1×6) అజేయ అర్ధశతకం బాదడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆర్సీబీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో ఛేదించింది. క్రిస్‌ లిన్‌(62 నాటౌట్‌), రాబిన్‌ ఉతప్ప(36), సునీల్‌ నరైన్‌(27), దినేశ్‌ కార్తీక్‌(23) తలో చేయి వేయడంతో కోల్‌కతా విజయాన్ని అందుకుంది. ఫలితంగా సొంత మైదానంలో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌కు నిరాశే ఎదురైంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతానే విజయం సాదించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా చేతిలో బెంగళూరు జట్టు ఓడిపోవడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి. ఏప్రిల్ 8న జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 4 వికెట్ల తేడాతో బెంగళూరుని కోల్‌కతా ఓడించింది.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(68 నాటౌట్‌; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, బ్రెండన్‌ మెకల్లమ్‌(38;28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డీకాక్‌(29;27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఫర్వాలేదనిపించారు.

ఛేదన ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్ (27: 19 బంతుల్లో 3×4, 1×6)‌ దూకుడుగా ఆడి బెంగళూరు బౌలర్లని ఇబ్బందిపెట్టగా.. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప.. భారీ షాట్లతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. మధ్యలో వర్షం కారణంగా.. అరగంట సేపు మ్యాచ్‌ ఆగినా.. ఎలాంటి ఓవర్ల కుదింపు లేకుండా మళ్లీ అంపైర్లు ఆటని కొనసాగించారు. వర్షం అనంతరం ప్రమాదరకంగా మారిన రాబిన్ ఉతప్పను స్పిన్నర్ మురగన్ అశ్విన్ బుట్టలో వేయగా.. తర్వాత వచ్చిన నితీశ్ రానా (15 రిటైర్డ్ హర్ట్) గాయంతో వెనుదిరిగాడు. దీంతో.. క్రీజులోకి వచ్చిన హిట్టర్ రసెల్ (0) ఆడిన తొలి బంతికే ఔటవడంతో.. మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అప్పటికి కోల్‌కతా స్కోరు 16.3 ఓవర్లలో 139. కానీ.. చివర్లో క్రిస్‌లిన్‌తో కలిసి దూకుడుగా ఆడిన దినేశ్ కార్తీక్.. జట్టుని విజయతీరాలకి చేర్చి ఔటవగా.. ఆఖరి ఓవర్‌లో శుభమన్ గిల్ (5 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని బౌండరీతో పూర్తి చేశాడు. క్రిస్‌లిన్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ని బెంగళూరు ఫీల్డర్ మురగన్ అశ్విన్ జారవిడచడం మ్యాచ్‌పై ఎక్కువ ప్రభావం చూపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -