Thursday, April 18, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు స్టార్ బ్యాట్స్‌మేన్ కుక్ గుడ్‌బాయ్‌..

- Advertisement -

క్రికెట్ అభిమానులకు చేదువార్త. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రకటించాడు. ఇండియాతో వచ్చే శుక్రవారం మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని కుక్ ప్రకటించాడు. ఈ మేరకు సోమవారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

33 ఏళ్ల కుక్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో ఆరోస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. అతని సగటు 44.88. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ అతడే. ఒకదశలో సచిన్ రికార్డులు బద్ధలు కొడతాడని అందరూ భావించినా.. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు.ఈ ఏడాది టెస్టుల్లో అతని సగటు కేవలం 18.62 మాత్రమే. ఇండియాతో జరుగుతున్న సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు

2016లో చిన్న వయస్సులో టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు. ఈ ఫీట్‌ని అతను 31 సంవత్సరాల, 157 రోజుల్లో సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.

ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాన‌ని కుక్ ప్ర‌క‌టించారు. నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ సాధించాను. ఇంగ్లండ్ జట్టులో ఇంతకాలంగా నేను ఆడటం ఎంతో సంతోషంగా.. గౌరవంగా ఉంది. ఇక కొందరు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూంని పంచుకోలేను అని తెలిసి కాస్త బాధగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం’’ అని పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -