- Advertisement -

14 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితుడితో!

- Advertisement -

భారత వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పిన్నర్ సిమ్రంజీత్ సింగ్‌తో తిరిగి కలిశాడు. వీరిద్దరి కలయికకు ఆసియా కప్ 2025 వేదికైంది. దుబాయ్‌ వేదికగా బుధవారం యుఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన యుఏఈ కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ కేవలం 4.3 ఓవర్లలో టార్గెట్ చేజ్ చేసింది. గిల్ 9 బంతుల్లో 20 పరుగులు* చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ ..తన చిన్ననాటి మిత్రుడు యూఏఈ ఆటగడు సిమ్రంజీత్ సింగ్‌ని ఆలింగనం చేసుకున్నాడు. ఈ సన్నివేశం అభిమానులను కంటతడి పెట్టేలా చేసింది.

మ్యాచ్‌కు ముందు సిమ్రంజీత్ మాట్లాడుతూ శుభ్‌మన్‌ని చిన్ననాటి నుంచే తెలుసు. కానీ అతను నన్ను గుర్తుంచుకున్నాడో లేదో తెలియదు. 2011–12 ప్రాంతంలో మేము పీసీఏ అకాడమీలో (మోహాలీ) ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాళ్లం. శుభ్‌మన్ తండ్రితో కలిసి ఉదయం 11 గంటల సమయంలో వచ్చేవాడు. అప్పటికి అతనికి 11–12 సంవత్సరాల వయసు మాత్రమే ఉండేది అని చెప్పారు.

అయితే, మ్యాచ్ అనంతరం గిల్ తనను హత్తుకోవడంతో తన అనుమానాలన్నీ పోయాయని సిమ్రంజీత్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -