టీ20 వరల్డ్ కప్‌ని రెండోసారి గెల్చుకుంది టీమిండియా. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణించి టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఇక నిన్న భారత్‌కు చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. ఇక ముంబైలోని స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రేక్షకులు వేలాదిగా తరలివచ్చారు.
ఇక టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు పేసర్ మహ్మద్ సిరాజ్. ఇవాళ సిరాజ్ హైదరాబాద్ చేరుకోనుండగా అతడికి ఘన స్వాగతం చెప్పేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో ప్రారంభం కానుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది.
వాంఖడే స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు అభిమానులను ఉత్తేజ పర్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తీన్ మార్ స్టెప్పులు వేస్తూ అభిమానులను ఉర్రూతలూగించారు. సేమ్ సీన్ హైదరాబాద్‌లోనూ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు సిరాజ్ అభిమానులు.
