టీ20 ప్రపంచకప్ 2026లో భారత్–యూఎస్‌ఏ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సూర్య నిలబడి అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌ను భారీ అప్సెట్ నుంచి కాపాడాడు. సూర్య ఇన్నింగ్స్‌తో భారత్ గెలుపొందగా మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన సూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
దీంతో టీ20 అంతర్జాతీయాల్లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు సూర్య. లక్ష్య ఛేదనలో భారత్ బౌలర్లు కూడా చెలరేగి యూఎస్‌ఏకు అవకాశం ఇవ్వలేదు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 20 ఓవర్లలో 132/8కే పరిమితమై, భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ తన 17వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు. దీంతో టీ20లలో భారత్ తరఫున అత్యధిక అవార్డులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (16) రికార్డును అధిగమించాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
17 – సూర్యకుమార్ యాదవ్ (105 మ్యాచ్‌లు)
16 – విరాట్ కోహ్లీ (125)
14 – రోహిత్ శర్మ (159)
8 – అక్షర్ పటేల్ (88)
