Sunday, May 5, 2024
- Advertisement -

నాగ‌ర్‌కోటీ ఆస్పీడ్ ఏంటి…? భ‌విష్య‌త్ ఫేస్ బౌల‌ర్ ఆశాకిర‌నం

- Advertisement -

న్యూజిలాండ్‌లో శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియాపై యువ‌భార‌త్ అద్భుత విజ‌యాన్ని సాధించి క‌ప్‌ను కైవ‌సం చేసుకుంది. దీని ద్వారా ప్ర‌తిభ‌గ‌ల యువ క్రికెట‌ర్లు వెలుగులోకి వ‌చ్చారు. వారిలో శుభ్‌మన్ గిల్, మన్జోత్ కల్రా, కెప్టెన్ పృథ్వీ షా బ్యాట్‌తో మెరిస్తే.. బంతితో అనుకుల్, అభిషేక్ వర్మ, నాగర్‌కోటి, శివమ్ మావి సత్తాచాటారు. ముఖ్యంగా నాగర్‌కోటి ఫైనల్లో గంటకి సరాసరి 143 కి.మీ వేగంతో బంతులు విసురుతూ దిగ్గజ క్రికెటర్లని సైతం ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అనే కాదు.. టోర్నీ మొత్తం కూడా నాగర్‌‌కోటి 140 కి.మీ వేగంతో బంతులు విసురుతూనే వచ్చాడు.

టాలెంట్ ఎక్కడున్నా వేగంగా గుర్తించే నైపుణ్యమున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గత నెల 14వ తేదీన ఓ ట్వీట్ చేశాడు. ‘విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ.. అండర్-19 ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శని ఓ సారి చూడండి. న్యూజిలాండ్ పిచ్‌లపై శివమ్ మావి, నాగర్ కోటి గంటకి 145 కి.మీ వేగంతో బంతులు విసురుతున్నారు’ అని ఆ ట్వీట్ చేశాడు.

ఫైనల్లో నాగర్‌కోటి 147 కి.మీ వేగంతో విసిరిన బంతికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జాక్ ఇవాన్స్‌ వద్ద సమాధానమే లేకపోయింది. బంతిని ఎదుర్కోలేక అతను క్లీన్ బౌల్డవగా.. వేగానికి ఆఫ్ వికెట్ గాల్లోకి లేచి వైడ్‌లైన్‌కి అవల పడింది. అండర్-19 జట్టు బౌలర్‌ ఇంత స్పీడ్‌తో బౌలింగ్ చేయడమా..? ఏంటి నాగర్‌కోటి ఈ స్పీడ్..? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భార‌త్ బ‌విష్య‌త్ ఆశాకిర‌ణం నాగ‌ర్‌కోటి అన‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -