వెస్టిండీస్‌పై టెస్టుల్లో ఘన విజయం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తమ జోరు కొనసాగించేందుకు భారత జట్టు సన్నద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌కు ఒక రోజు ముందే శనివారం భారత్ 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
తొలిసారి వన్డే జట్టులోకి ఎంపికైన రిషభ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా వన్డేల్లోనూ అరంగేట్రం చేయడం ఖాయమైపోయింది. ఫలితంగా మనీశ్ పాండే, కేఎల్ రాహుల్ పెవిలియన్‌కే పరిమితం అవుతున్నారు.టాప్–3 రోహిత్, ధావన్, కోహ్లి అద్భుతంగా ఆడుతుండటంతో జట్టుకు పెద్దగా ఇబ్బంది ఎదురు కావడం లేదు. కానీ మిడిలార్డర్‌లో ధోని మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఇక ముగ్గురు స్పిన్నర్లు చహల్, కుల్దీప్, జడేజాలు విండీస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలరు. ఈ ముగ్గురి ఓవర్లే మ్యాచ్‌ను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ధోని వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నా… టెస్టుల్లో అద్భుత ప్రదర్శన తర్వాత ఇప్పుడు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా రిషభ్ పంత్ వన్డేల్లోకి అరంగేట్రం చేయనుండటం విశేషం.
