Tuesday, May 21, 2024
- Advertisement -

సచిన్ ను కోచ్ గా చేయలన్న ఐడియా ఎవరిది?!

- Advertisement -

ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో అనూహ్యంగా సచిన్ టెండూల్కర్ టీమిండియాకు కోచ్ గా ఎంపికయ్యాడు.

అసలు ఇప్పుడప్పుడే సచిన్ ఇలాంటి బాధ్యతల్లోకి వస్తాడని కూడా ఎవ్వరూ ఊహించలేదు. ప్రపంచకప్ లో భారత్ కు జింబాబ్వే మాజీ ఆటగాడు డంకన్ ఫ్లెచర్ కోచ్ గా వ్యవహరించాడు. కప్ ముగియడంతోనే ఆయన కాంట్రాక్టు ముగిసింది. అయితే ప్రపంచకప్ లోనే ఫ్లెచర్ పాత్రను పరిమితం చేసింది బీసీసీఐ. భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రిని మేనేజర్ గా చేయడం ద్వారా ఫ్లెచర్ పాత్రను తగ్గించింది. ఇప్పుడు ఆయన కాంట్రాక్టు పూర్తిగా ముగిసిపోయింది. 

మరి సచిన్ భారత క్రికెట్ జట్టుకు దిశానిర్దేశం చేసే వ్యక్తి అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. మరి దీని వెనుక వ్యూహం ఎవరిది.. అంటే, అందరి సమిష్టి నిర్ణయమని తెలుస్తోంది. టెండూల్కర్ ను కోచ్ గా నియమించడం గురించి బీసీసీఐ పెద్దలు జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ల నిర్ణయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారట.

కెప్టెన్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కొహ్లీలు సచిన్ కోచింగ్ పై ఉత్సాహంగా ఉన్నారట. ఈ పేరు ప్రతిపాదనవెనుక ధోనీ, కొహ్లీలే కీలకపాత్ర పోషించారని కూడా తెలుస్తోంది. బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ , టీం డైరెక్టర్ రవిశాస్ర్తిని కూడా సంప్రదించాకే బోర్డు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత సచిన్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని, మూడేళ్లు ఈ బాధ్యతల్లో కొనసాగుతాడని తెలుస్తోంది. ఫ్లెచర్ కు ఎలాంటి కండిషన్లు, షరతులు, పరిమితులు ఉంటాయో అవన్నీ సచిన్ కు ఉంటాయని బీసీసీఐ ప్రకటించడం విశేషం.

మొత్తానికి చాన్నాళ్లకు టీమిండియాకు ఒక స్వదేశీ కోచ్ వచ్చాడు. జాన్ రైట్ ఆ తర్వాత చాపెల్ సుధీర్ఘకాలం కోచ్ లుగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులూ ప్రధాన కోచ్ లేకుండానే బండిని నడిపించారు. క్రిస్టన్ కూడా మళ్లీ కోచ్ గా మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఆయన తప్పుకొన్న అనంతరం ఫ్లెచర్ వచ్చాడు. అయితే ఫ్లెచర్ హయాంలో చెప్పుకోవడానికేమీ లేకుండా పోయింది. ఇప్పుడు సచిన్ వచ్చాడు. ఇకపై జట్టు ప్రస్థానం ఎలా ఉంటుందో!

Happy Fools Day  

Hope you had a good laugh friends.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -