Sunday, May 12, 2024
- Advertisement -

విండీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడి చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న పాక్‌…

- Advertisement -

వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. విండీస్ బౌల‌ర్ల దెబ్బ‌కి పాక్ బ్యాట్స్‌మెన్‌లు అంద‌రూ విల‌విల్లాడారు.క్రిస్‌గేల్(50: 34 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), నికోలస్ పూరన్(34నాటౌట్: 19 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో కేవలం 13.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.మొత్తంగా 35.2 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ ముగిసింది.

లక్ష్యం మరీ చిన్నది కావడంతో విండీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశారు. 4.3 ఓవర్లలోనే 36 పరుగులు రాబట్టారు. ఈ దశలో భారీ షాట్‌కు ప్రయత్నించిన షాయ్ హోప్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారెన్ బ్రావో డకౌట్ కాగా… 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్రిస్‌గేల్… తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, హెట్మయర్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు. నికోలస్ పూరన్ 34 పరుగులు చేయగా, హెట్మయర్ 7 పరుగులు చేశాడు

మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ అతి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. క‌నీసం సగం ఓవ‌ర్లైనా బ్యాటింగ్ చేయలేక 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బౌలర్ల పదునైన బంతులకు వరుసగా పెవిలియన్ చేరారు. వెస్టిండీస్ బౌలర్ల పదునైన బంతులకు వరుసగా పెవిలియన్ చేరారు.

ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో పాక్ దారుణ‌మైన చెత్త రికార్డును నెల‌కొల్పింది. ఫకార్ జమాన్(22), బాబర్ అజామ్(22), మహ్మద్ హఫీజ్(16), వాహబ్ రియాజ్(18) మినహా ఏ ఒక్కరు డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు.ఆఖర్లో హోల్డర్ బౌలింగ్‌లో రియాజ్ రెండు సిక్సర్లు.. ఒక ఫోర్ బాది 17 పరుగులు రాబట్టాడు. ఇమామ్ ఉల్ హక్(2), హారీస్ సొహైల్(8), సర్ఫరాజ్ అహ్మద్(8), మహ్మద్ హఫీజ్(16) అందరూ విఫలమయ్యారు. పాక్ బ్యాట్స్ మేన్‌లు ఏద‌శ‌లోను పోరాట‌ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ‌కుండా అంద‌రూ పెవిలియ‌న్‌కు చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -