Monday, April 29, 2024
- Advertisement -

ధోని క్రికెట్ కు దూరంగా ఉండేది అందుకా….?

- Advertisement -

ప్రపంచకప్ తర్వాత ధోని క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌‌ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కాని ఇప్పటి వరకు ధోని తన రిటైర్మెంట్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ధోనీ సెలక్షన్‌కి అందుబాటులో లేడంటూ చెప్పుకొస్తున్న సెలక్టర్లు.. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా వరుస సిరీస్‌ల్లో రిషబ్ పంత్‌ని ఎంపిక చేస్తున్నారు. కాని రిషబ్ పంత్ కూడా విఫలం వుతున్నారు.

ఇదలా ఉంటె మహేంద్రసింగ్ ధోనీ గత రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉండటం వెనుక కొత్త కారణం వెలుగులోకి వచ్చింది.ఈ ఏడాది ఐపీఎల్‌ సమయంలో వెన్నునొప్పితో కొన్ని మ్యాచ్‌లకి దూరమైన ధోనీని.. వరల్డ్‌‌కప్‌ సమయంలోనూ ఆ నొప్పి ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వెన్నునొప్పికి తోడు.. అతని చేతి మడమకి కూడా గాయమైందని.. దీంతో.. క్రికెట్‌కి కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఈ మాజీ కెప్టెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రపంచకప్ లో కూడా వెన్ను నొప్పితోనె ఆటను కొనసాగించారు.నవంబరులో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌కి కూడా దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే సెలక్టర్లకి సమాచారం అందించాడు. దీంతో ధోని మైదానంలో అడుగు పెట్టేది కొత్త సంవత్సంరలోనె.

వచ్చే సంవత్సరం ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చారు. కాని ఇచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు.దీంతో.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోపు జట్టుకి మెరుగైన వికెట్ కీపర్‌ని సిద్ధం చేసుకోవడం ఎలా..? అనే టెన్షన్‌లో ప్రస్తుతం టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది. ఒక వేల నిలకడగా ఆడే కీపర్ లేనప్పుడు అప్పుడు ధోనీని ఎంపిక చేసె అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -