Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీ పై కమళ దలం మూకుమ్మ‌డి దాడి

- Advertisement -
BJP Hits TDP on YS Jagan Meets PM Narendra Modi

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోదీతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఇద్దరి భేటీ ఆధారంగా అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ జట్టు కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు వాదిస్తున్నారు.

ఇప్ప‌టికే బాబు మైలేజి ప‌డిపోవ‌డంతో ….భాజాపా జ‌గ‌న్‌తో స్నేహానికి త‌లుపులు తెర‌చిన‌ట్లేన‌నే వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్ప‌డు ఈ భేటీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-భాజాపాలు ఒక‌రి నొక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. టీడీపీ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తుంటే…క‌మ‌ల ద‌లం జ‌గ‌న్‌ను వెనుకేసుకొస్తున్నారు. ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షం టీడీపీమీద ఈస్థాయిలో మూకుమ్మ‌డి దాడి జ‌ర‌గ‌లేదు.కానీ ఇప్పుడు భాజాపా బ్యాచ్ మొత్తం బాబుకు చుక్కుల చూపిస్తున్నారు.
మోదీతో జ‌గ‌న్ భేటీపై ప‌చ్చ‌పార్టీ అవాకులు చ‌వాకులు పేలుతోంది.జగన్ ఆర్థిక నేరస్తుడు అని, అవినీతిపరుడు అని అలాంటి వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఏంటని? తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. కేసుల విషయంలో ప్రధాని మోడీ కాళ్లుపట్టుకుని మాఫీ చేయించుకునేందుకే జగన్ మోడీని కలిశారని పలువురు టీడీపీ నేతలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పించారు. దేవినేని, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు మొదలు కొని రాజేంద్రప్రసాద్, వర్లరామయ్య వంటి వారు కూడా ఈ భేటీపై తమ అక్కసు వెళ్లగక్కారు.
అయితే అనుకోని రీతిలో జ‌గ‌న్‌కు భాజాపా పుల్ స‌పోర్ట్ ల‌భించింది. క‌మ‌ల‌ద‌ళం నాయ‌కులంతా ఒకే సారి మూకుమ్మ‌డి మాట‌ల దాడికి దిగ‌డంతో టీడీపీ కుడితో ప‌డిన ఎల‌క‌లాగా త‌యార‌య్యంది ప‌రిస్థి.బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఒక ప్రధాన మంత్రిని ఓ ప్రతిపక్షనేత కలవడంలో ఎలాంటి వింతాలేదని జగన్ ను వెనకేసుకొచ్చారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇక రాష్ట్ర‌నేత‌లు అయితే చెప్పాల్సిన ప‌నిలేదు.టీడీపీకి చుక్కులు చూపించారు.భాజాపా ఎమ్మెల్యే విష్ణ‌కుమార్‌రాజు చెల‌రేగిపోయారు.భేటీలో జ‌గ‌న్ కేసుల గురుంచి మాట్లాడుకోవ‌డం మీరు చూశార‌ని అచ్చెన్నాయుడిని క‌డిగి పారేశారు.జ‌గ‌న్ పీఎంను క‌లిస్తే త‌ప్పేముందంద‌ని ..టీడీపీకి ఉలుకెందుకోన‌న్నారు.టీడీపీ నేత‌ల‌ను అడిగి అపాయంట్‌మెంట్ ఇచ్చే స్తితిలో ప్ర‌ధాని మోది లేర‌న్నారు.
ఇక అదేపార్టీ సీనియ‌ర్ నేత పురందేశ్వ‌రి బాబ‌ను ఆయ‌న బ్యాచ్‌ను ఏకిపారేశారు. మోదీతో జ‌గ‌న్ కేసుల‌గురించి మాట్లాడింది మీరుచూశారా..మేము చూశామ‌ని టీడీపీని నిల‌దాశారు.భేటీపై పెడార్థాలు తీయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.పొత్తుల విష‌యంలో అధిష్టానం చూసుకుంటుంద‌ని తెలిపారు.
ఈ ప‌రిణామాల‌న్ని చూస్తె భాజాపా-టీడీపీ మ‌ధ్య పొత్తుకు బీట‌లు పారిన‌ట్లు క‌న‌ప‌డుతోంది.దీనికి ప్ర‌ధాన కార‌నం ఎప్పుడూ లేనంత‌గా అధిస్టానం నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు జ‌గ‌న్‌కు స‌పోర్టుగా భాజాపా మాట్లాడ‌టం చూస్తె వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇద్దురు కల‌సిపోవ‌డంలో సందేహంల‌దేనిపిస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -