హాట్ ఫోటోలతో వైరల్ అవుతున్న తెలుగు అమ్మాయి కల్పిక..!

326
actress kalpika ganesh stunning photoshoot stills
actress kalpika ganesh stunning photoshoot stills

‘ప్రయాణం’ మూవీతో నటిగా పరిచమైంది కల్పిక గణేష్. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో హీరోయిన్ కంటే ఈ భామకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కల్పిక ’ఓం శాంతి’ ’నమో వెంకటేశ’ ’నిప్పు’ ‘జులాయి’ ‘సారొచ్చారు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘పడి పడి లేచె మనసు’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ తెలుగమ్మాయి.

ప్రధానంగా మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈమె నటన అందర్ని ఆకట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన కల్పికకు ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉంది. ఇక ఈ బ్యూటీ పెద్ద నటి అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కు కూడా ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక గత కొంత కాలం నుంచి తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. బోల్డ్ పాత్రలకు రెడీ అన్నట్లుగా కల్పిక ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ భామ.. ఇప్పుడూ వర్కౌట్లు చేసి స్లిమ్ గా అయింది. ఈమెకు సంబంధించిన హాట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఈమె బర్త్ డే కాబట్టి విశేష్ తెలిజేస్తూ.. ఎన్నో సినిమాల్లో నటించాలని కోరుకుందాం.


Loading...