రష్మీకకు ఎంత చిన్న చెల్లి ఉందో తెలుసా ?

16958
Actress Rashmika with her OWN sister Shiman cute moments
Actress Rashmika with her OWN sister Shiman cute moments

రష్మీక మందన 2020లో ఇప్పటికే రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు.. రీసెంట్గా భీష్మా. ఈ 2 మూవీస్ లో కూడా తన క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని అలరించిన రష్మీక టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆమె భీష్మా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.

ఛలో మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. కెరీర్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న రష్మీక కాస్త ఫ్రీ టైం దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తోంది. రష్మీక స్వస్థలం బెంగళూరు. ఏప్రిల్ 5 1996 లో జన్మించింది ఆమె.

అమ్మ సుమన్ మందన.. నాన్న మదన్ మందన. రష్మీకకు ఆరు సంవత్సరాల చెల్లి కూడా ఉంది. తన పేరు షీమన్ మందన. మాములుగా అక్క చెల్లెల్లు అంటే కొట్టుకోవటం గోల గోలగా ఉంటుంది ఇంట్లో. కానీ రష్మీకకు, షీమన్ కు వయసు గ్యాప్ ఎక్కువగా ఉండడంతో తన చిట్టి చెల్లెలును చాలా ప్రేమగా చూసుకుంటుంది రష్మీక. తన కంటిన్యూ షూటింగ్స్ ఉన్నప్పుడు తన చెల్లెలును చాలా మిస్ అవుతానని రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మీక.

Loading...