Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో కి అలీ రీ ఎంట్రీ?

- Advertisement -

బిగ్ బాస్ షో లో ప్రస్తుతం పదకొండు మంది మాత్రమే మిగిలారు. అయితే అలీ రెజా వెళ్ళిపోయినా విషయాన్ని ఇంకా ఇంటి సభ్యులు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. అలీ వెళ్ళిపోతాడు అనే విషయం ఎవరూ గ్రహించలేకపోయారు. అలీ ఒక్క సారి గా కూడా ఎలిమినేషన్స్ లో కి రాలేదు అని కొంత మంది అతడిని నామినేట్ చేయగా, అలీ మొత్తానికి ఇక తక్కువ ఓట్లతో బయటకు వెళ్ళిపోయాడు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. అయితే అలీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అని, తనకి కోపం ఎక్కువ అని కారణాలు చెప్తూ ఇంటి సభ్యులు అతడిని నామినేట్ చేశారు.

ఇక అలీ వెళ్ళిపోయాడు అనగానే అందరూ షాక్ అవడం గమనించిన ఇంటి సభ్యులు అతడిని మరలా తిరిగి తీసుకొని రావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా సరే అలీ ని మళ్ళీ హౌస్ లో కి తీసుకొని రావాలని ఒక ప్లాన్ చేస్తున్నారట టీమ్ సభ్యులు. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా షో మరింత ఆసక్తికరం గా మారుతుంది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. మరి అలీ తిరిగి వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -