Saturday, April 27, 2024
- Advertisement -

అర్జున్‌ రెడ్డికి మించి ఉన్నట్లు ఉందిగా ..!

- Advertisement -

అర్జున్‌ రెడ్డి తెలుగు సినిమా స్థితిని గతిని మార్చిన సినిమా. ఈ సినిమాతోనే విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోగా మారాడు. ఈ సినిమాతోనే సందీప్‌ వంగాకు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. మరి ఇలాంటి సినిమాను అన్ని భాషల్లో రీమేక్‌ చేయలని భావిస్తారు. తమిళ భాషతో పాటు హిందీలో ఈ సినిమాను రీమేక్‌ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాలో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. కియారా అడ్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. కంబీర్‌ సింగ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని షాహిద్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్ చూడగానే అర్జున్ రెడ్డి కు డబుల్ డోస్ అనే అర్దం వస్తుంది. రెండు జాయింట్లను ఒకేసారి నోట్లో పెట్టుకొని పొగ పీలుస్తున్న షాహిద్ ఈ పోస్టర్‌లో ఉండడం ఆసక్తికరంగా ఉంది. ఇక సినిమా టీజర్‌ను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తామని పోస్టర్లో తెలిపారు. 2019 జూన్‌ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి బాలీవుడ్‌లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -