Saturday, April 27, 2024
- Advertisement -

బుర్రకథ రివ్యూ

- Advertisement -

చిత్రం: బుర్రకథ
నటీనటులు: ఆది, మిష్టి చక్రాబోర్తి, నైరా షా, రాజేంద్ర ప్రసాద్, అభిమన్యు సింగ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: సి రామ్ ప్రసాద్
ఎడిటింగ్‌: ఎం ఆర్ వర్మ
నిర్మాత: హెచ్ కె శ్రీకాంత్ దీపాల, కిషోర్
దర్శకత్వం: డైమండ్ రత్న బాబు
బ్యానర్: దీపాల ఆర్ట్స్
విడుదల తేదీ: 05/07/2019

కథ:

అభిరామ్ (ఆది సాయి కుమార్) పుట్టడమే రెండు బుర్రలతో పుడతాడు. ఒక బుర్ర పేరు అభి మరొకరు రామ్. ఇద్దరూ చాలా భిన్న మనస్తత్వాలు కలవారు. ఎప్పుడైనా అభి పెద్ద పెద్ద శబ్దాలు వింటే రామ్ బయటికి వస్తూ ఉంటాడు. అభి ప్లే బాయ్ లాగా అమ్మాయిల వెనుక తిరుగుతూ ఉంటాడు మరోవైపు రామ్ దైవ సంగత్యంలో కాలం గడపాలని అనుకుంటూ ఉంటాడు. ఈ సమయంలో అభి హ్యాపీ(మిష్టి చక్రాబోర్తి) తో ప్రేమలో పడతాడు. మరోవైవు హ్యాపీ తండ్రి (పోసాని కృష్ణ మురళి) ఒక బ్రెయిన్ స్పెషలిస్ట్. తన కూతురి విషయంలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకునే తండ్రి. మరి రెండు బుర్రలున్న అభి హ్యాపీ ప్రేమకోసం ఏం చేశాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

ఆది ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటనను కనబరిచాడు. తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉన్నప్పటికీ ఆ రెండింటి మధ్య తేడాని చాలా చక్కగా చూపించగలిగాడు. మిస్ట్రీ చక్రవర్తి ఈ సినిమాలో కేవలం తన అందంతో మాత్రమే కాక పర్ఫార్మెన్స్ తో కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. తన పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించింది. ఎప్పటిలాగానే రాజేంద్రప్రసాద్ తన పాత్రకు ఊపిరిపోశారు అని చెప్పవచ్చు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని విపరీతంగా నవ్విస్తారు పోసాని కృష్ణ మురళి. థర్టీ ఇయర్స్ పృథ్వీ కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అభిమన్యు సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లలో ఒకటి. గాయత్రి గుప్తా తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. మిగతా నటీనటులు ప్రభాస్ శీను, జోష్ రవి, జబర్దస్త్ మహేష్, ఫిష్ వెంకట్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ సినిమా కోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నారు. ఒకే మనిషికి రెండు బుర్రలు ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ పై ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కించారు దర్శకుడు. అయితే కథ అంత బలంగా లేకపోవడం వల్ల ప్రేక్షకులు స్టోరీ తో కనెక్ట్ అవ్వలేరు. దర్శకుడు నెరేట్ చేసే విధానం మరియు స్క్రీన్ ప్లే కూడా కొంచెం బోర్ కొట్టిస్తాయి. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్ కె శ్రీకాంత్ దీపాల మరియు కిషోర్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సాయి కార్తీక్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పాటల సంగతి పక్కన పెడితే సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సి రామ్ ప్రసాద్ కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బాగుంది.

తీర్పు:

సినిమాలో అంత బలమైన కథ లేదు కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ తో సినిమా నడిపిద్దామని అనుకున్నారు దర్శకుడు. అయితే సినిమా మొదలైన మొదటి పది నిమిషాల్లోనే కాన్సెప్ట్ మొత్తం అర్థం అయిపోతుంది. మిగతా సినిమా అంతా ఆ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి అల్లుకున్న ఒక సింపుల్ స్టోరీ. సినిమా మొదటి హాఫ్ కొంచెం సరదా సరదాగా, కామెడీ తో సాగిపోతూ ఉంటుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం కామెడీ పెద్దగా పండలేదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు అభిమానుల సహనాన్ని పరిక్షిస్తున్నట్టే ఉంటాయి. నటీనటులు, ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. చివరగా ‘బుర్ర కథ’ సినిమా ఒకసారి చూడదగ్గ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -