Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిక్స్.. ఏ మూవీతో అంటే ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి శుభవార్త.. ఎప్పటి నుంచో పవన్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నందుకు తాజాగా గుడ్ న్యూస్ వచ్చింది. పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించబోయే మూవీ లాంచ్ కి డేట్ కూడా ఖరారైంది. పవర్ స్టార్ కంబ్యామ్ మూవీ ’పింక్’ తెలుగు రీమేక్ ఫిక్సయింది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ లో పింక్ సినిమాని తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు బోనీ కపూర్.

ఇదే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేసేందుకు బరిలోకి దిగుతున్నారు. ఇదివరకే పవన్ కళ్యాణ్ కు కథ వినిపించారు. కథ నచ్చడంతో పవన్ కూడా ఓకే చేశాడు. అయితే ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి బోనీకపూర్ నిర్మించనున్నారట. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ విషయంకు వస్తే.. ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ లో ఓ మై ఫ్రెండ్ సినిమాని తీశాడు. ఈ చిత్రంలో సిద్దార్ద్, హన్సిక, శృతిహాసన్ నటించారు.

మొత్తానికి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చూస్తున్న దిల్ రాజ్ ప్రయత్నం సఫలమైంది. ఇక పవన్ కల్యాణ్- వేణు శ్రీరామ్- దిల్ రాజు- బోనీకపూర్ కాంబినేషన్ సెట్ కావడంతో పింక్ తెలుగు రీమేక్ పై భారీగా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సినిమాలు చేస్తూనే పవన్ రాజకీయాల్లో కొనసాగనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -