సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్..

500
Pawan Kalyan Movie Vakeel Saab Release Date
Pawan Kalyan Movie Vakeel Saab Release Date

వేసవికి రావాల్సిన స్టార్ హీరో కం జనసేనాని పవన్ కళ్యాణ్ సంక్రాంతికి కొత్త అల్లుడి వలే రాబోతున్నాడు. ఈ మేలో రిలీజ్ కావాల్సిన ‘వకీల్ సాబ్’ మూవీని కరోనా కారణంగా వచ్చిపడిన లాక్ డౌన్.. థియేటర్స్ మూత నేపథ్యంలో దసరాకు పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు దసరాకు కూడా థియేటర్స్ తెరుస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇక కరోనా భయానికి జనాలు కూడా థియేటర్స్ కు ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇక సంక్రాంతికే వకీల్ సాబ్ ను పోస్ట్ చేసినట్టు తాజా సమాచారం..

పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి 2 ఏళ్లు దాటింది. వచ్చే సంక్రాంతికి వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. సంక్రాంతి అన్ని సినిమాలకు మాంచి సీజన్. ఫుల్ వసూళ్లు వస్తాయి. పైగా అప్పటికి పవన్ సినిమా వచ్చి 3 ఏళ్లు అవుతుంది. సో ఖచ్చితంగా పవన్ సినిమాను చూస్తారు. ఈలోగా కరోనా కూడా కంట్రోల్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట..

ఇక కరోనాతో ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ వాయిదా పడడంతో దిల్ రాజ్ కంగారు పడుతున్నారట.. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడితే అప్పుడు తాను డేట్స్ ఇస్తానని.. కంగారు పడవద్దని.. ఈ సినిమా పూర్తయ్యేకే వేరే సినిమా మొదలుపెడుతానని ధైర్యం చెప్పినట్టు తెలిసింది. సో ఇలా కరోనా కారణంగా పవన్ కళ్యాణ్ సైతం తన రూల్స్ పక్కనపెట్టేశారు.

Loading...