Friday, April 26, 2024
- Advertisement -

పెరుగుతూ పోతున్న పారితోషికాలు, ఆపేది ఎవరు?

- Advertisement -

పెరుగుతున్న బడ్జెట్స్, పెరుగుతున్న ఖర్చుల కి అనుగుణం గా ఎప్పటికి అప్పుడు సినిమాల కి సంబందించిన హీరోల మార్కెట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అందుకే హీరోలు కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా వాళ్ళ పారితోషికాలు అమాంతం పెంచేస్తున్నారు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అగ్ర కథానాయకులు గా ఉన్నారు. పవన్ ఎలాగో సినిమాల్లో యాక్టివ్ గా లేరు కనుక మహేష్ బాబు టాప్ హీరో అని చెప్పొచ్చు. సీనియర్ల లో చిరంజీవి కి ఉన్న మార్కెట్ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ కి లేదు.

అయితే ఇప్పుడు తాజా గా ఫిలిం నగర్ లో ఈ హీరోల పారితోషికం విషయం లో ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. మహేష్ బాబు దాదాపుగా ఒక సినిమా కి 50 కోట్లు పారితోషికం గా తీసుకుంటూ ఉంటె, ప్రభాస్ 40 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక మిగిలిన హీరోలు అందరూ వీరి తర్వాత నే ఉంటారు.

రామ్ చరణ్,అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కేవలం 20 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. నాని మరియు విజయ్ దేవరకొండ వంటి వారు పది కోట్ల వరకు తీసుకుంటున్న నేపథ్యం లో ప్రొడ్యూసర్స్ అంతా కలిసి బడ్జెట్ కంట్రోల్ లో భాగం గా ఈ పెరుగుతున్న పారితోషికం విషయం లో ఏదో ఒకటి చేసి కట్టడి చేయాలని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -