Friday, April 26, 2024
- Advertisement -

పవన్ కు స్పెషల్ ఫ్లైట్ ఇచ్చిన దిల్ రాజు.. ఎందుకు ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ మొత్తానికి మళ్లీ సినిమా షూటింగ్స్ లో జోరు పెంచారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. అయితే సినిమాలు చేయనని.. రాజకీయాలోనే ఉంటానని చెప్పినప్పటికి అతని మనసు మార్చి.. సినిమాని ఓకే చేయించుకున్నాడు నిర్మాత దిల్ రాజు. అంతేకాకుండా పవన్ కు 50 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఉదయం ఉద్యమాలు సాయంత్రం షూటింగ్ లంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రత్యేక విమానంలో చక్కర్లు కొడుతున్నారు. స్పష్టం చేశాడట.. తనకు రాజకీయం ముఖ్యమని.. ఏ సమస్య వచ్చినా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి వెళతానని ఒప్పందం చేసుకున్నాడట.. దీంతో దిల్ రాజు కూడా సరేనని పవన్ ఖాళీ టైంలోనే సినిమా షూటింగ్ జరుపుతున్నారట. అయితే పవన్ రాజకీయాల కోసం సినిమా షూటింగ్ లు బంద్ చేయడం ఇష్టంలేని దిల్ రాజు ఏకంగా రాజకీయం సినిమా షూటింగ్ రెండు జరిగేలా పవన్ కోసం ప్రత్యేక విమానాన్ని బుక్ చేశారు.

ఉదయం షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం చేరుకొని అమరావతిలో పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. రాత్రికి హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ లో పాల్గొని సినిమా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలు రాజకీయం బ్యాలెన్స్ చేస్తూ కష్టపడుతున్నారు. పవన్ ప్రయాణిస్తున్న విమాన ఖర్చు కోటుకిపైనే దిల్ రాజు భరిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -